దేశంలో కరోనా కేసులు 31 వేల 332కు చేరాయి. ఇప్పటివరకు 1007 మంది వైరస్ కారణంగా మరణించారు. 24 గంటల వ్యవధిలో 1897 కొత్త కేసులు నమోదుకాగా.. 73 మంది చనిపోయారు. ఒక్కరోజులో నమోదైన మరణాల సంఖ్యలో ఇదే అత్యధికమని అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
![Total number of #COVID19 positive cases in India rises to 31332 including 1007 deaths](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6982304_india-glance-2.jpg)
మొత్తం 7,695 మంది కోలుకోగా.. ప్రస్తుతం 22 వేల 629 యాక్టివ్ కేసులున్నాయి.
భారత్లో కరోనాకు కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసులు 9318కి చేరాయి. రాష్ట్రంలో 1388 మంది కోలుకున్నారు. మరో 400 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో కరోనా మృతుల సంఖ్య 181కి పెరిగింది. మధ్యప్రదేశ్లో 120, దిల్లీలో 54, రాజస్థాన్లో 51 చొప్పున మరణించారు.
ఆంధ్రప్రదేశ్లో 1259, తెలంగాణలో 1004 మంది కరోనా బారిన పడ్డారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య వరుసగా 31,26గా ఉంది.