భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, దిల్లీ, రాజస్థాన్‌లపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఒక్కరోజులో 2,560మందికి కరోనా నిర్ధరణ అయింది. కొత్తగా 122 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 74,860కి పెరిగింది.
గుజరాత్లో కొత్తగా 485మందికి..
గుజరాత్లో కేసుల ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. ఒక్కరోజులో 485 మందికి వైరస్ సోకింది. 30 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 18,117 మంది వైరస్ బారిన పడగా.. 1,122 మంది ప్రాణాలు కోల్పోయారు.
మధ్యప్రదేశ్‌లో ఏడుగురు మృతి..
మధ్యప్రదేశ్‌లో కొత్తగా 168 మందికి వైరస్ సోకింది. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య 8,588 కి చేరింది. 371మంది మృతి చెందారు. ఇప్పటివరకు 5,445 మందిలో మహమ్మారి నయమవగా.. 2,772 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చెన్నైలో 17వేలు దాటిన వైరస్ కేసులు..
తమిళనాడులో కొత్తగా 1,286మందికి వైరస్ సోకింది. 11మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య 25,872కు చేరింది. రాజధాని చెన్నైలో 17,598మందికి వైరస్ సోకింది. మృతుల సంఖ్య 208కి పెరిగింది.
కర్ణాటకలో 267మందికి వైరస్..
కర్ణాటకలో ఒక్కరోజు వ్యవధిలో 267మందికి కరోనా సోకింది. ఒకరు వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 4,063కు పెరిగింది. ఇప్పటివరకు 53 మంది మృతి చెందారు.
జమ్ముకశ్మీర్‌లో..
జమ్ముకశ్మీర్‌లో వైరస్ బాధితుల సంఖ్య 2,718కి పెరిగింది. ఇప్పటివరకు 33మంది ప్రాణాలు కోల్పోయారు. 953మందిలో వైరస్ యాక్టివ్‌గా ఉంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ..
ఉత్తర్‌ప్రదేశ్‌లో వైరస్ బాధితుల సంఖ్య 8,870కి పెరిగింది. 230మంది మహమ్మారికి బలయ్యారు. 5,257మందిలో వైరస్ యాక్టివ్‌గా ఉంది.
ఇదీ చూడండి: సరిహద్దు రగడపై కీలక భేటీకి భారత్-చైనా రెడీ