ETV Bharat / bharat

కేసులు, రికవరీలు ఈ 5 రాష్ట్రాల్లోనే అధికం - coronavirus in india health ministry latest news

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు, రికవరీల సంఖ్య అధికంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 78.86 శాతానికి చేరిందని తెలిపింది. అదే సమయంలో మరణాల రేటు 1.63 శాతానికి తగ్గినట్లు స్పష్టం చేసింది.

Top 5 states with high active COVID-19 caseload report high level of recoveries too: Health ministry
ఎక్కువ కేసులు, రికవరీలు ఈ 5 రాష్ట్రాల్లోనే
author img

By

Published : Sep 18, 2020, 5:06 PM IST

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. కేసులతో పాటు రికవరీల సంఖ్య కూడా ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందని పేర్కొంది.

తాజా గణాంకాల ప్రకారం దేశంలో గురువారం 87,472 మంది బాధితులు కోలుకున్నారని... దీంతో మొత్తం రికవరీల సంఖ్య 41,12,551కి చేరినట్లు వైద్య శాక తన నివేదికలో వెల్లడించింది. ఫలితంగా రికవరీ రేటు 78.86 శాతానికి చేరిందని తెలిపింది. ఇదే సమయంలో మరణాల శాతం 1.63కి తగ్గినట్లు స్పష్టం చేసింది. గత 11 రోజులుగా 70 వేలకుపైగా బాధితులు ప్రతి రోజు కోలుకుంటున్నట్లు పేర్కొంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీల సంఖ్య 4.04 రెట్లు అధికంగా ఉందని తెలిపింది.

వైద్య శాఖ గణాంకాలు

  • యాక్టివ్ కేసుల్లో 59.8 శాతం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
  • రికవరీల్లో 59.3 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే ఉన్నాయి.
  • కొత్తగా కోలుకుంటున్న వారిలో 90 శాతం.. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచే ఉన్నారు.
  • కొత్తగా నమోదవుతున్న రికవరీల్లో మహారాష్ట్ర(22.31 శాతం), ఆంధ్రప్రదేశ్(12.24 శాతం), కర్ణాటక(8.3 శాతం), తమిళనాడు(6.31 శాతం), ఛత్తీస్​గఢ్(6 శాతం) రాష్ట్రాలు ముందున్నాయి.

ఈ-ఐసీయూ

ఎయిమ్స్​తో కలిసి నేషనల్ ఈ-ఐసీయూ ఆన్ కొవిడ్ మేనేజ్​మెంట్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది కేంద్రం. దీని ద్వారా ఐసీయూ వైద్యులకు సెంటర్ ఆఫ్ ఎక్స్​లెన్స్​ ద్వారా శిక్షణ ఇస్తోంది. వారానికి రెండు సార్లు(గురు, శుక్రవారాల్లో) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రికవరీ రేటు గణనీయంగా పెంచడంలో దోహదపడిందని కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 28 రాష్ట్రాల్లోని 249 ఆస్పత్రులో కలిపి 19 ఈ-ఐసీయూ కార్యక్రమాలను నిర్వహించినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి- యక్షగానంలో ముస్లిం మహిళ అసమాన ప్రతిభ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.