ETV Bharat / bharat

'ఇవాళ కృష్ణాష్టమి.. జైలు కావాలా? బెయిలా?' - krishnashtami news

కృష్ణాష్టమి సందర్భంగా ఓ బెయిల్ పిటిషన్​పై విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణుడి జన్మస్థలానికి వెళతారా? బెయిల్​ కావాలా అని సరదాగా వ్యాఖ్యానించారు. మరో విచారణలో మహాభారతాన్ని ఉదహరించారు.

CJI-KRISHNASTAMI
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే
author img

By

Published : Aug 12, 2020, 6:05 PM IST

సుప్రీం కోర్టులో ఓ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేటుచేసుకుంది. శ్రీకృష్ణుడి జన్మస్థలం కావాలా? బెయిల్‌ కావాలా? అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే సరదాగా వ్యాఖ్యానించారు.

1994లో భాజపాకు చెందిన రాజకీయ నేత హత్య కేసులో కాంగ్రెస్‌కు చెందిన ధర్మేంద్ర వాల్వి, మరో ఐదుగురు ఆ పార్టీ కార్యకర్తలు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వాల్వి బెయిల్‌ పిటిషన్‌ మంగళవారం విచారణకు వచ్చింది.

"ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి. కృష్ణుడు పుట్టింది జైలులోనే. మరి మీకు జైలు కావాలా? బెయిలు కావాలా?" అని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు సీజేఐ. అందుకు ఆయన బెయిల్‌ కావాలని చెప్పగా.. "మంచిది. మీకు పెద్దగా మతం పట్టింపులు లేవనుకుంటా" అంటూ బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెలువరించారు.

మహాభారత కాలం నుంచీ..

సీఏఏకు సంబంధించిన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగానూ సీజేఐ ఇలానే సరదా వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు సంబంధించి డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరుపరచడాన్ని నేరుగా హాజరైనట్లు పరిగణిస్తారా? అన్న సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ సందేహానికి సీజేఐ సరదాగా సమాధానమిచ్చారు.

"ఇక్కడ మహా భారత కాలం నుంచి వర్చువల్‌ విచారణలు జరుగుతున్నాయి" అంటూ చమత్కరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ను హాజరుగానే పరిగణిస్తామని స్పష్టతనిచ్చారు.

ఇదీ చూడండి: 'క్రిమిసంహారక సొరంగాల బ్యాన్​పై మీరేమంటారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.