ETV Bharat / bharat

జమ్ము కశ్మీర్​కు త్వరలోనే రాష్ట్ర హోదా: అమిత్‌ షా - Bukhari latest meetings

జమ్ము కశ్మీర్​కు త్వరలోనే మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. కొత్తగా ఏర్పడిన అప్నీ పార్టీ అధినేతతో భేటీ అయిన్​ షా ఈ మేరకు హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై లోక్​సభలో చర్చించారని గుర్తుచేశారు.

To restore the Jammu and Kashmir statehood: Amit Shah
జమ్ము కశ్మీర్​కు త్వరలోనే రాష్ట్ర హోదా: అమిత్‌ షా
author img

By

Published : Mar 16, 2020, 4:14 AM IST

Updated : Mar 16, 2020, 5:44 AM IST

జమ్ము కశ్మీర్​కు త్వరలోనే రాష్ట్ర హోదా: అమిత్‌ షా

జమ్ము కశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులను విడుదల చేస్తామన్నారు. జమ్ము కశ్మీర్‌కు చెందిన అప్నీ పార్టీ అధినేత అల్తఫ్‌ బుకారీ నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధులు ఆదివారం అమిత్‌ షాను కలిశారు. అంతకు ముందు రోజే వారు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు.

కశ్మీర్​ అభివృద్ధి మన కళ్లముందే..

జమ్ము కశ్మీర్‌ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని అమిత్​ షా అన్నారు. డెమోగ్రఫిక్‌ మార్పులకు సంబంధించి వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలతో కలిసి పనిచేసి త్వరలోనే జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తుందని.. అమిత్​ షా అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

70 ఏళ్లలో లేని పెట్టుబడులు నాలుగేళ్లలో..

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ, లోక్‌సభలో ఆగస్టు 6న తానూ ఇదే విషయాన్ని చెప్పామని అమిత్​ షా గుర్తుచేశారు. జమ్ము కశ్మీర్‌ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆంక్షలు ఎత్తివేస్తామని తెలిపారు. త్వరలోనే నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలను కూడా విడుదల చేస్తామన్నారు. ఏ ఒక్కరూ మరణించకూడదన్నదే తమ ఉద్ధేశమని పేర్కొన్నారు. గత 70 ఏళ్లలో రాని పెట్టుబడులు వచ్చే నాలుగేళ్లలో సమకూరనున్నాయని చెప్పారు. నిరుద్యోగ సమస్యను కూడా తొలగిస్తామని హామీ ఇచ్చారు షా.

ఇదీ చదవండి: 'కశ్మీర్​ అభివృద్ధికి అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తున్నాం'

Last Updated : Mar 16, 2020, 5:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.