ETV Bharat / bharat

సాగు చట్టాలపై భాజపా దూకుడు- రంగంలోకి మంత్రులు - రైతుల ఆందోళనలు

నూతన వ్యవసాయ చట్టాలపై సందేహాలను పోగొట్టేందుకు పంజాబ్​లో 8 మంది కేంద్రమంత్రులు పర్యటించనున్నారు. రైతులు, పరిశోధకులు, రైతుల సంఘాల నేతలతో అక్టోబర్​ 13-20 మధ్య మంత్రులు భేటీ కానున్నారు. ఈ చట్టాలపై కాంగ్రెస్ చేస్తోన్న 'ఉద్దేశపూర్వక ఆందోళనల'ను తిప్పికొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

BJP
భాజపా
author img

By

Published : Oct 12, 2020, 4:46 PM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ పాలిత ప్రాంతాల్లో వెల్లువెత్తుతున్న నిరసనలకు భాజపా కళ్లెం వేయాలని భావిస్తోంది. ఇందుకోసం పంజాబ్​లో అక్టోబర్​ 13-20 వరకు 8 మంది కేంద్ర మంత్రులు పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ పర్యటనలో రైతులు, వ్యవసాయ పరిశోధకులు, రైతు సంఘాల నేతలతో మంత్రులు మాట్లాడి, చట్టాలపై వివరించనున్నట్లు తెలుస్తోంది. కొత్త చట్టాలపై వారి సందేహాలను తీర్చేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కేంద్రమంత్రులు హర్​దీప్ సింగ్ పూరీ, గజేంద్ర సింగ్ షెకావత్, జితేంద్రసింగ్, కైలాశ్ చౌదరి, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్​, సంజీవ్ బలియాన్, సోమ్​ ప్రకాశ్ ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీరంతా వేర్వేరుగా అమృత్​సర్ నుంచి మొహాలీ వరకు పర్యటిస్తారు.

కాంగ్రెస్​కు కళ్లెం వేసేందుకు..

వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేస్తోందని భాజపా ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రచారాన్ని దీటుగా ఎదుర్కోవాలని భాజపా నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు. "లగ్జరీ ట్రాక్టర్​లో ఆందోళన నిర్వహించే వారికి రైతుల బాధలు ఎప్పటికీ అర్థం కావు" అని ఓ సీనియర్ భాజపా నేత విమర్శించారు.

"ఈ చట్టాలు విప్లవాత్మకమైనవి. రైతులపై పన్నులు లేకపోతే తమ జేబులు ఖాళీ అవుతాయని గ్రహించి కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది" అని భాజపా జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్​ ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: సాగు చట్టాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.