తమిళనాడు తంజావూరులో 15 వందల ఏళ్ల నాటి సొరంగాన్ని అధికారులు కనుగొన్నారు. బృహదీశ్వర్ ఆలయ సమీపంలో కార్పొరేషన్ అధికారులు కాలువ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా ఈ సొరంగం బయటపడింది.
దీంతో పురాతత్వ శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు... సొరంగం 1500 ఏళ్ల నాటిదని నిర్ధరించారు. దీనిపై పరిశోధనలు ప్రారంభించారు.
క్రీస్తు పూర్వం 846-1225 మధ్య కాలంలో చోళులు తంజావూరును పరిపాలించారని చరిత్ర చెబుతుంది. ఈ కాలంలో అనేక దేవాలయాలను చోళ రాజులు నిర్మించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఉపాధి కోసం 60 ఏళ్ల మహిళల 'సాగర సాహసాలు'