బెంగళూరుకు చెందిన ప్రముఖ కళాకారుడు బాదల్ నంజుండస్వామి కరోనా జాగ్రత్తలపై వినూత్న పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నాడు. మార్వెల్ సూపర్ విలన్ థానోస్ సబ్బు పట్టుకుని నల్లా వద్ద చేతులు కడుక్కుంటున్నట్టు.. టైటానిక్ సినిమాలోని ప్రధాన పాత్రలైన రోజ్, జాక్ మాస్కు పెట్టుకుని పోజ్ పెట్టినట్టు గోడల మీద బొమ్మలు గీస్తున్నాడు.
సామాజిక అంశాలపై ఇలాంటి కళాఖండాలు వేయడం నంజుండస్వామికి మొదటిసారేమీ కాదు. తన చేతిలోని చిత్ర కళను గోడలపై ప్రదర్శించి ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో తనకు తానే సాటి. ఇప్పుడు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కనీస జాగ్రత్తలు పాటించాలని ఈ కళాఖండాలతో పిలుపునిచ్చాడు నంజుండ.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: వరద ధాటికి కూలిన వంతెన