బ్రిటన్ బెర్క్‌షైర్‌కు చెందిన ఓ జంట సేకరించిన కళాఖండాల్లోని మైసూర్ సామ్రాజ్య చివరి రాజు టిప్పు సుల్తాన్ ఆయుధాల వేలం జరిగింది. బెర్క్‌షైర్ కేంద్రంగా పని చేస్తున్న ఆంటోనీ 'క్రిబ్ లిమిటెడ్ ' ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించారు. దీనికి పురాతన ఆయుధాల సేకరణ సంస్థగా మంచి పేరుంది.
టిప్పు సుల్తాన్‌కు చెందిన ఆయుధాలు వేలంలో 107,000 పౌండ్లకు అమ్ముడయ్యాయి.
అందులో వెండితో తయారైన 20-బోర్ ఫింట్లాక్ తుపాకీ, బాయ్నెట్ 60,000 పౌండ్లకు అమ్ముడవడం విశేషం.
వీటితో పాటు బంగారం పూత పూసినకత్తి సహా టిప్పు సుల్తాన్ వ్యక్తిగత కత్తులన్నీ కలిపి18,500 పౌండ్లకు అమ్ముడయ్యాయి.
వీటిని దక్కించుకునేందుకు 58 బిడ్లు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. ఇక ఇతర వస్తువు విషయానికొస్తే...బెటెల్ నట్ కాస్కెట్ 17,500 పౌండ్లు, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన గోల్డ్ సీల్ రింగ్ 2,800 పౌండ్లకు అమ్ముడయ్యాయి.
ఇందులో మొత్తం 8 వస్తువులు వేలం వేయగా... అన్నింటికి కలిపి 107,000 పౌండ్లు వచ్చినట్లునిర్వాహకులు తెలిపారు.