ETV Bharat / bharat

రామ్​లీలా మైదానంలో మోదీ ర్యాలీకి భారీ భద్రత - modi rally in delhi

పౌరసత్వ చట్టంపై ఆందోళనల నడుమ ఈరోజు దిల్లీలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. రామ్​లీలా మైదానం చుట్టూ 5000 మంది ట్రాఫిక్ పోలీసుల్ని మోహరించారు. ఆ ప్రాంతమంతా బలగాల అధీనంలో ఉంది.

tight security for modi rally
రామ్​లీలా మైదానంలో మోదీ ర్యాలీకి భారీ భద్రత
author img

By

Published : Dec 22, 2019, 11:16 AM IST

దేశవ్యాప్తంగా ‘పౌర’జ్వాలలు కొనసాగుతున్న వేళ దిల్లీలో నేడు ప్రధాని మోదీ చేపట్టనున్న ర్యాలీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ బహిరంగ సభకు వేదిక కానున్న రామ్‌లీలా మైదానం, పరిసర ప్రాంతాలు పూర్తిగా భద్రతా బలగాల అధీనంలోకి వెళ్లిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల గగనతలాన్ని ‘నో ఫ్లై’ జోన్‌గా ప్రకటించారు. కొంతమంది ఆందోళనకారులు ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే ఈ ఏర్పాట్లు చేశారు. రానున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా తరఫున నేడు మోదీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

5000మంది ట్రాఫిక్ ఫోలీసులు

రామ్‌లీలా మైదానం చుట్టూ దాదాపు 5000 మంది ట్రాఫిక్‌ పోలీసుల్ని మోహరించారు. జాతీయ భద్రతా దళానికి చెందిన ప్రత్యేక యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌, యాంటీ డ్రోన్‌ బృందాల్ని సైతం రంగంలోకి దించారు. గగనతలం నుంచి ఏదైనా ముప్పు పొంచి ఉన్నా ఎదుర్కొనేలా పటిష్ఠ ఏర్పాట్లు చేశామని దిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రత్యేక భద్రతా దళాలు(ఎస్పీజీ), దిల్లీ పోలీసులు కలిసి మూడంచెల్లో భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికైతే పరిసర ప్రాంతాల్లో సెక్షన్‌ 144 విధించలేదని తెలిపారు. ఇక మైదానంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, సీర్‌పీఎఫ్‌ సహా దిల్లీ పోలీసులు విభాగానికి చెందిన మొత్తం రెండు వేల మంది భద్రతా సిబ్బంది ఉండనున్నారని వెల్లడించారు. ఎత్తైన భవనాలపై స్నైపర్‌ రైఫిళ్లతో బలగాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి.

గుర్తింపు కార్డు ఉంటేనే..

ర్యాలీకి హాజరయ్యే వారిని క్షుణ్నంగా తనిఖీ చేయనున్నారు. సరైన గుర్తింపు కార్డు ఉన్నవారినే సభకు అనుమతించనున్నారని సమాచారం. ప్రవేశ ద్వారాల వద్ద మెటల్‌ డిటెక్టర్లు.. నాయకులు, ప్రముఖుల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని దిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. రామ్‌లీలా పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను సభ పూర్తయ్యే వరకు మూసివేయనున్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నాయి.

ఇదీ చూడండి: 'పౌర' చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​ సత్యాగ్రహం

Mumbai, Dec 22 (ANI): Bollywood actors Kriti Sanon and Siddhant Chaturvedi were spotted outside the office of Kwan Entertainment in Mumbai. Kriti wore black and white top paired with blue jeans. She clicked pictures with a fan. 'Gully Boy' Siddhant wore black sweatshirt with black jeans. Kriti will be next seen in film 'Mimi' while Siddhant will be seen in 'Bunty Aur Babli 2'.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.