ETV Bharat / bharat

ఆ మూడు సంరక్షణ కేంద్రాల్లో పులులు మాయం! - total number of tigers in India

దేశంలో మూడు పులుల సంరక్షణ కేంద్రాల్లో... పులులు అదృశ్యమైపోయాయి. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన నివేదికలో కేంద్రం పేర్కొంది. మచ్చుకైనా ఒక్క పులి కూడా లేకుండాపోయిందని తెలిపింది. అత్యధికంగా కార్బెట్‌ రిజర్వులో 231 వ్యాఘ్రాలు ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఆ మూడు ప్రాంతాల్లో పులులు మాయం కావడానికి కారణమేంటి? నివేదిక ఏం చెబుతోంది?

Tigers disappear at three tiger sanctuaries: report by central government
ఆ మూడు సంరక్షణ కేంద్రాల్లో పులులు మాయం!
author img

By

Published : Jul 29, 2020, 6:42 AM IST

దేశవ్యాప్తంగా మూడు పులుల సంరక్షణ ప్రాంతాల్లో ఒక్కటీ లేకుండా పులులు అదృశ్యమైపోయాయి. ఆశ్చర్యకరమైన ఈ అంశం కేంద్రం విడుదల చేసిన తాజా నివేదిక ద్వారా వెల్లడైంది. 2014తో పోలిస్తే దేశంలో వ్యాఘ్రాల సంఖ్య రెట్టింపైనప్పటికీ.. మిజోరంలోని డంపా, పశ్చిమ బెంగాల్‌లోని బుక్సా, ఝార్ఖండ్‌లోని పలమౌ సంరక్షణ కేంద్రాల్లో ఒక్క పులి కూడా లేకుండాపోయిందని తేలింది. తెలంగాణలో 26 పులులు ఉన్నట్లు వెల్లడించింది. కేంద్రమంత్రి జావడేకర్‌ మంగళవారం ఈ నివేదికను విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా టైగర్‌ రిజర్వుల్లో 1,923 పులులున్నాయి. అత్యధికంగా ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ టైగర్‌ రిజర్వులో 231 పులులు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో కర్ణాటకలోని నాగర్‌హోల్‌ (127), బాందీపోర్‌ (126) సంరక్షణ కేంద్రాలు నిలిచాయి. కజిరంగా (అసోం), బాంధవ్‌గఢ్‌ (మధ్యప్రదేశ్‌) సంరక్షణ కేంద్రాల్లో 104 చొప్పున ఉన్నాయి. రాష్ట్రాలపరంగా చూస్తే.. మధ్యప్రదేశ్‌లో గరిష్ఠంగా 526 పులులు ఉండగా, కర్ణాటకలో 524, తెలంగాణలో 26 నివసిస్తున్నాయి.

Tigers disappear at three tiger sanctuaries: report by central government
ఆ మూడు సంరక్షణ కేంద్రాల్లో పులులు మాయం!

అడవి కుక్కలు, ఎలుగుబంట్లు

  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అటవీ ప్రాంతాల్లో పులులు తిరిగేచోట అడవి కుక్కలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో కూడా వీటి ఆనవాళ్లు చిక్కాయి.
  • అమ్రాబాద్‌, శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం, శ్రీవెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటిచోట్ల ఎలుగుబంట్లు ఉన్నాయి.
  • ఉత్తర తెలంగాణలో దేశీయ తోడేళ్ల ఆనవాళ్లు ఎక్కువ ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి.

అమ్రాబాద్‌లో 7 పులులు

తెలంగాణలో మొత్తం 26 పులులు లెక్క తేలగా వాటిలో 7 అమ్రాబాద్‌ సంరక్షణ కేంద్రంలోనే ఉన్నాయి. ఇక్కడ 338 కెమెరాలలో రికార్డయిన అంశాలను విశ్లేషించగా పులులతోపాటు మరో 42 జంతుజాతులు కనిపించాయి. అయితే అమ్రాబాద్‌ ప్రాంతంలో జరుగుతున్న అటవీవనరుల అంతర్థానం పులుల మనుగడకు ప్రమాదకరంగా మారినట్లు కేంద్ర నివేదిక వెల్లడించింది.

  • స్మగ్లింగ్‌, జంతువుల వేట, అడవుల నరికివేత వంటివాటి వల్ల జీవవైవిధ్యం ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంది.
  • కవ్వాల్‌ అటవీప్రాంతంలో ఏర్పాటుచేసిన 100 కెమెరాల్లో ఒక పులి మాత్రమే దొరికింది. కానీ మరో 40 జంతుజాతులు కనిపించాయి. ఈ ప్రాంతంలో పులుల సంఖ్య పెరగాలంటే ఇక్కడున్న మనుషుల ఆవాసాలను మరోచోటికి తరలించాలని, జంతువుల వేటను అరికట్టాలని నివేదిక పేర్కొంది.
  • మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీప్రాంతంలో 101 కెమెరా పాయింట్లు ఏర్పాటు చేయగా ఒక పులి కనిపించింది.

ఇదీ చూడండి: 'ఐటీఈఆర్​ ప్రాజెక్టుకు భారతీయ శాస్త్రవేత్తల విశేష తోడ్పాటు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.