మహారాష్ట్ర చంద్రాపుర్లో రెండు అడవి జంతువుల మృతదేహాలు అటవీశాఖ అధికారులకు లభ్యమయ్యాయి. అందులో ఒకటి పులి కాగా, రెండోది చిరుత.
సీతారామ్పేట్- మొహార్లీలోని 'తబోడా అంధారీ టైగర్ రిజర్వ్(టీఏటీఆర్)' అడవి పరిధిలో పులి మృత దేహం లభ్యమైనట్లు అటవీ చీఫ్ కన్జర్వేటర్ ఎన్.ఆర్ ప్రవీణ్ తెలిపారు. కుళ్లిపోయిన పులి కళేబరాన్ని చూసి.. అది నాలుగురోజుల క్రితం మరణించినట్లు భావించారు అధికారులు.
చంద్రాపుర్- సవోలీ అటవీ ప్రాంతంలో చిరుత మృతదేహం లభ్యమైంది. అయితే అడవి పందులకోసం వేసిన వల ఉచ్చులో అది చిక్కుకుని చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: టీవీ చూడొద్దని మందలిస్తే.. ఉరేసుకున్నాడు!