ఛత్తీస్గఢ్ ధంతరీ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నలుగురు మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
ధంతరి జిల్లాలోని కల్లారీ, మెక్కా గ్రామాల్లో ప్రత్యేక పోలీసు కార్యదళం... కూబింగ్ చేస్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన పోలీసులు నలుగురు మావోయిస్టులను హతమార్చారు.
ఘటనా స్థలంలోని నాలుగు మృత దేహాలను, 7 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: వారణాసిలో ప్రధాని మోదీ హరితహారం