భారత వాయుసేన అమ్ములపొదిలో మూడు రఫేల్ యుద్ధ విమానాలు చేరినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫ్రాన్స్‌లో ప్రస్తుతం వీటిని.. పైలట్లు, సహాయ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి వినియోగిస్తున్నట్టు స్పష్టం చేసింది.
తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్ సంస్థ నుంచి అక్టోబర్ 8న అందుకున్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. అనంతరం అయుధ పూజ కూడా నిర్వహించారు. అయితే.. మిగతా రెండు యుద్ధ విమానాలను భారత్ ఎప్పుడు, ఎక్కడ స్వీకరించిందో ప్రభుత్వం స్పష్టం చేయలేదు.
రక్షణశాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్.. ఈ వివరాలను లోక్‌సభకు లిఖితపూర్వకంగా అందించారు.
తొలి బ్యాచ్ రఫేల్ విమానాలు మే 2020లోగా భారత్‌కు చేరుతాయి. ఇందులో మొత్తం నాలుగు విమానాలుంటాయి. మొత్తం 36 విమానాలను కొనుగోలు చేసింది ప్రభుత్వం.
ఇదీ చూడండి- రఫేల్: ఒప్పందమా? కుంభకోణమా?? అసలేం జరిగింది???