ETV Bharat / bharat

మంచి చెప్పినా వినని ముగ్గురు ముష్కరులు హతం - 3 terrorists killed

దక్షిణ కశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులు లొంగిపోయేలా రాష్ట్రీయ రైఫిల్స్ చేసిన ప్రయత్నాలు విఫలమై, కాల్పులకు దారితీసిందని అధికారులు తెలిపారు.

JK-ENCOUNTER
ఎన్​కౌంటర్
author img

By

Published : Oct 7, 2020, 7:04 PM IST

జమ్ముకశ్మీర్​లోని షోపియాన్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్​కౌంటర్​ మధ్యలో ముష్కరులను లొంగిపోవాలని స్థానికులతో ఒప్పించే ప్రయత్నాలు విఫలమయ్యాయని అధికారులు తెలిపారు.

షోపియాన్​లోని సుగన్​ జైనపొరాలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఆపరేషన్​ ప్రారంభమైంది. సుమారు రాత్రి 8.30 గంటలకు ఎన్​కౌంటర్​ను మధ్యలో నిలిపేశారు. ఉగ్రవాదులు లొంగిపోయేలా స్థానికులతో ఒప్పించాలని నిర్ణయించినట్లు 44 రాష్ట్రీయ రైఫిల్స్ అధికారులు తెలిపారు.

వినకపోగా బాంబులు విసిరి..

ఇందుకోసం కొంతమంది మతపెద్దలు, స్థానికంగా ఉండే ప్రముఖ వ్యక్తులతో లౌడ్​ స్పీకర్ల ద్వారా ప్రకటన చేయించారు. అయితే, ప్రకటన చేస్తున్నవారిపై ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసరగా బుధవారం ఉదయం మళ్లీ ఆపరేషన్​ ప్రారంభించాయి బలగాలు.

తక్కువ సమయంలోనే ముగ్గురు ముష్కరులను అంతమొందించి ఆపరేషన్​ను ముగించారు. వీరంతా నిషేధిత ఉగ్రసంస్థ అల్-​ బదర్​కు చెందినవారిగా సైన్యం గుర్తించింది.

రాష్ట్రీయ రైఫిల్స్..

కశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతలో 44-రాష్ట్రీయ రైఫిల్స్ కీలక పాత్ర పోషిస్తోంది. జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకే 1990లో దీన్ని ఏర్పాటు చేశారు.

44-ఆర్ఆర్​కు ఈ ప్రాంతంలోని ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదుల కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వారిని లొంగిపోయేలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తుంది. వివిధ కార్యక్రమాల్లో యువత కూడా భాగమయ్యేలా ఏర్పాట్లు చేస్తుంటుంది.

ఇదీ చూడండి: కేరళలో అత్యాచార దోషి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.