బిహార్ సారన్ జిల్లాలో దారుణం జరిగింది. బనియాపుర్ ఠాణా పరిధిలోని పైగంబర్పుర్లో జరిగిన మూకదాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆవులను దొంగలించారన్న నెపంతో ఈ ముగ్గురిని కొంతమంది గ్రామస్థులు చావబాదారు.
మృతులను పైగంబర్పుర్ గ్రామానికి చెందిన రాజు నట్, బిదేస్ నట్, నౌషద్ ఖురేషిలుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనాస్థలానికి రాగా అప్పటికే ఘోరం జరిగిపోయింది. మూకదాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను శవపరీక్షలకు పంపించారు.
ఇదీ చూడండి: ఇంట్లోకి వచ్చి మంచం ఎక్కిన పులి...!