ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో హెలికాఫ్టర్ కుప్పకూలింది. వరద ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసరాలు అందించి వెనుదిరుగుతుండగా మోల్డీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్, సహపైలట్తో పాటు మరొకరు మృతి చెందారు.
ఈ ప్రైవేట్ హెలికాఫ్టర్.. హెరిటేజ్ ఏవియేషన్ సంస్థకు చెందింది.
హెలికాఫ్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 15 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించారు.
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలకు ఉత్తరకాశీ జిల్లా విలవిలలాడుతోంది. అకాల వర్షాలకు మోరీ ప్రాంతంలో 16 మంది మృతిచెందారు.
ఇదీ చూడండి:- దిల్లీలో రెచ్చిపోయిన దుండగులు... నడిరోడ్డుపైనే చోరీ!