ఝార్ఖండ్ లాతేహార్లో నక్సల్స్ విరుచుకుపడ్డారు. నక్సల్స్ దాడిలో ఎస్సై సహా... ముగ్గురు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు హోంగార్డులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.
విధుల్లో భాగంగా పోలీసు బృందం చంద్వా పోలీస్ స్టేషన్ ప్రాంత సమీపంలో వారి వాహనంలో ప్రయాణిస్తుండగా మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు.