మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అల్మోరీ గని నుంచి ఉత్తర్ప్రదేశ్ రిహంద్ నగర్లోని ఎన్టీపీసీకి బొగ్గు సరఫరా చేస్తున్న ఓ గూడ్స్ రైలు.. సిగ్రౌలి జిల్లా గన్హారీ గ్రామం వద్ద మరో రైలుతో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దురు లోకోపైలట్లు సహా మరో వ్యక్తి మృతి చెందాడు. మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే చనిపోయిన వారి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రైళ్లు ఢీకొన్న ప్రాతంలో ఉన్న రైల్వే ట్రాక్.. ఎన్టీపీసీ పర్యవేక్షణలో ఉన్నట్లు స్పష్టం చేశారు.