అనాస పండులో పేలుడు పదార్థాలు పెట్టి ఓ ఏనుగును చంపిన ఘటన మరువక ముందే కర్ణాటక చిక్కమగళూరులో మరో దారుణం వెలుగుచూసింది. పొలంలోకి జంతువులు చొరబడకుండా విషం పూసిన పనస పండ్లను పెడితే.. వాటిని తిని మూడు ఆవులు మృతిచెందాయి.
చిక్కమగళూరు జిల్లా బాసవరళ్లి గ్రామానికి చెందిన కొట్టె గౌడ, మధు అనే వ్యక్తులకు చెందిన మూడు ఆవులు విషంతో నిండిన పనసపండ్లు తిని చనిపోయాయి. పొలంలోకి జంతువులు చొరబడకుండా ఆపడం కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: కేరళలో మరో ఏనుగు మృతి.. కారణం అదేనా?