ETV Bharat / bharat

కేంద్ర కేబినెట్‌ పరిమిత విస్తరణ!

రాజకీయ అవసరాలు, కొందరు మంత్రుల పనిభారాన్ని తగ్గించాలనే కారణంగా కేంద్ర మంత్రివర్గాన్ని పరిమితంగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా బిహార్‌, ఝార్ఖండ్‌, దిల్లీ ఎంపీలకు చోటుదక్కే వీలు కనిపిస్తోంది. దిల్లీ, లద్దాఖ్‌లకు కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్లును నియమించే అవకాశం ఉంది.

కేంద్ర కేబినెట్‌ పరిమిత విస్తరణ!
author img

By

Published : Oct 18, 2019, 8:55 AM IST

కేంద్ర మంత్రివర్గాన్ని పరిమితంగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ అవసరాలు, కొందరు మంత్రుల పనిభారాన్ని తగ్గించాల్సి ఉండడం వంటివి దీనికి దారి తీస్తున్నాయి. వచ్చే సంవత్సరం బిహార్‌, ఝార్ఖండ్‌, దిల్లీ శాసనసభలకు ఎన్నికలున్నాయి. రాజకీయ అవసరాల దృష్ట్యా అక్కడి ప్రజాప్రతినిధులకు కేబినెట్‌లో స్థానం కల్పిస్తూ చిన్నపాటి విస్తరణ చేయవచ్చని చెబుతున్నారు. బిహార్‌లో మిత్రపక్షంగా ఉన్న జేడీయూకి మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం శ్రేయస్కరం కాదన్న ఉద్దేశంతో భాజపా అధినాయకత్వం ఉంది.

నృపేంద్ర మిశ్రకు గవర్నర్‌గా అవకాశం

జమ్మూకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఈ నెల 31 నుంచి మార్చనున్నారు. ఆ రోజు నుంచే లద్దాఖ్‌కు కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దిల్లీకీ కొత్త గవర్నర్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏదో ఒక దానికి ప్రధాని మాజీ ముఖ్య కార్యదర్శి నృపేంద్రమిశ్రను నియమించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జమ్మూ-కశ్మీర్‌కు సత్యపాల్‌మాలిక్‌ను యథావిధిగా కొనసాగించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. లద్దాఖ్‌ వాసులతో సంతోషాన్ని పంచుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 31న అక్కడికి వెళ్లాలని యోచిస్తున్నారు. అదేరోజు ‘ఏక్‌భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌’ పేరుతో పటేల్‌ విగ్రహం వద్ద భారీ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పటేల్‌ స్ఫూర్తితో జమ్మూ-కశ్మీర్‌ను సంపూర్ణంగా భారత్‌లో అంతర్భాగం చేసిన అంశాన్ని చాటడానికి వీలుగా ప్రధాని అదేరోజు లద్దాఖ్‌లో పర్యటించాలని భావిస్తున్నారు.

రామ జన్మభూమి తీర్పు దృష్టితోనే..

రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువడిన వెంటనే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి పదవీకాలం నవంబర్‌ 17తో ముగుస్తుంది. ఆ రోజు ఆదివారం. ముందురోజు శనివారం. ఆయన తుది పనిదినం 15వ తేదీ అవుతుంది. అదేరోజు, లేదంటే అంతకుముందే రామజన్మభూమిపై తుది తీర్పు వెలువడవచ్చని భావిస్తున్నారు. తదనుగుణంగా నవంబర్‌ 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలన్నది ప్రభుత్వ భావనగా చెబుతున్నారు.

ఇదీ చూడండి: ఈ నెల 24 నుంచి 'ఏక్​ భారత్​-శ్రేష్ఠ్​ భారత్'​

RESTRICTION SUMMARY: MUST CREDIT KTRK, NO ACCESS HOUSTON, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, REUSE OR ARCHIVE
SHOTLIST:
KTRK - MUST CREDIT KTRK, NO ACCESS HOUSTON, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, REUSE OR ARCHIVE
Cinco Ranch, Texas - 16 October 2019
1. Police vehicle near crime scene
2. Police tape blocks street
3. SOUNDBITE (English) Sheriff Troy Nehls, Fort Bend County:
"The father woke up and confronted apparently two individuals, at which time there was some gunshots that were fired and the homeowner, a white male, is deceased inside the residence."
4. Police outside crime scene
5. SOUNDBITE (English) Sheriff Troy Nehls, Fort Bend County:
"It's sad, sad. We have a homeowner now here in Fort Bend County who is no longer with us, and the father of two small children. Breaks your heart."
6. Various exteriors of the home
7. SOUNDBITE (English) Sheriff Troy Nehls, Fort Bend County:
"It's a little unusual to have, not saying it doesn't happen but it's a little unusual for guys that are wanting to break into a home to steal a television or something to break into a house at midnight. There were cars in the driveway."
8. Police vehicles in front of home
STORYLINE:
Investigators say a 29-year-old man was shot and killed by intruders who broke into his suburban Houston home.
The Fort Bend County Sheriff's Office says Brenton Estorffe was killed early Wednesday at his home in Cinco Ranch, a community 26 miles (42 kilometers) west of Houston.
Sheriff Troy Nehls says Estorffe told a 911 operator that someone had broken a window in the back of his house. The man confronted the two intruders and was shot. The intruders then fled.
Nehls says Estorffe didn't appear to be armed. His wife and two young children were not injured.
Relatives said on social media that Estorffe was an Australian native. No arrests have been made and investigators haven't established a motive.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.