ETV Bharat / bharat

పుష్కరం తర్వాత ఆ మొక్క మళ్లీ పూసింది

ఎన్నో వ్యాధులను నయం చేయగల ఔషధ గుణాలున్న ఓ మొక్క... 12ఏళ్ల తర్వాత మళ్లీ పుష్పించింది. చివరిసారిగా కేరళలో వికసించిన ఆ పుష్పాలు... తాజాగా మధ్యప్రదేశ్​లో దర్శనమిచ్చాయి. అప్పట్లోనే దీని గొప్పతనాన్ని తెలుసుకున్న ఓ యూరోపియన్‌ మహిళ.. ఆ మొక్క పేరిట ఓ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం. ఆ మొక్క పేరేంటి? దాని ఔషధ గుణాలు, చరిత్ర గురించి తెలుసుకుందాం?

The worlds unique flower which blooms only once in 12 years are back in Pachmarhi of Madhya Pradesh
పుష్కరం తర్వాత ఆ మొక్క మళ్లీ పూసింది!
author img

By

Published : Sep 19, 2020, 3:18 PM IST

నీల్‌కురంజి పుష్పాలు మరోసారి వికసించాయి. సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి పుష్పించే ఈ పువ్వులు తాజాగా మధ్యప్రదేశ్‌లోని పచ్‌మరి ప్రాంతంలో దర్శనమిచ్చాయి. చివరిసారిగా 2006లో కేరళలోని మన్నార్‌ ప్రాంతంలో వికసించిన నీల్‌కురంజి ఈసారి కాస్తా ఆలస్యంగా పుష్పించాయి. ఈ అందాలను వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పర్యటకులు వస్తుంటారు. కేరళ, మధ్యప్రదేశ్‌లోనే కాకుండా తమిళనాడులోని కొడైకెనాల్‌ తదితర ప్రాంతాల్లోనూ ఈ పుష్పాలు కనిపిస్తుంటాయి.

నీల్‌కురంజి ప్రత్యేకత ఏంటి?

ఇది ఓ గడ్డిజాతికి చెందిన పువ్వు. గుబురుగా పెరిగే మొక్క పూలు పూస్తుంది. పేరుకు తగ్గట్టే నీలి రంగులో ఉండే ఈ పువ్వు.. దక్షిణభారత దేశంలోని పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని మొదటిసారిగి 1838 సంవత్సరంలో గుర్తించారు. అప్పటి నుంచి పుష్కరానికోసారి పూస్తున్నట్లు గుర్తించారు. పువ్వులు పూసిన తర్వాత వాటి విత్తనాలు ఆ ప్రాంతమంతా వెదజల్లినట్లుగా విస్తరిస్తాయి. తర్వాత కొన్ని రోజులకు ఆ మొక్కలు చనిపోతాయి. ఆ తర్వాత మళ్లీ 12 ఏళ్లకు ఈ విత్తనాలు మొక్కలుగా మారి పుష్పిస్తాయి. ఈ పువ్వులు పూసిన ప్రాంతమంతా నీలిరంగులో కనువిందు చేస్తుంది.

The worlds unique flower which blooms only once in 12 years are back in Pachmarhi of Madhya Pradesh
నీల్‌కురంజి పుష్పాలు

ఔషధ గుణాలూ ఎక్కువే

ఈ పువ్వుకు అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని పలువురు చెబుతుంటారు. అనేక మొండి వ్యాధులను నయం చేసే శక్తి ఈ పుష్పాలకు ఉంటుందని ఆయుర్వేదంలోనూ ఉందట. అందుకే 12 ఏళ్లపాటు ఓపిగ్గా నిరీక్షించి, ఆ పూలు పూయగానే వాటిని సేకరించి ఔషధాలు తయారు చేస్తారు. సరైన మోతాదులో ఉపయోగిస్తే నీల్‌కురంజి నయం చేయలేని రోగమంటూ లేదని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పుష్పంలో ఏ భాగాన్ని ఉపయోగించాలో తెలిసే గ్రంథాలన్నీ బ్రిటిష్‌ వారి హయాంలో నాశనం అయిపోయాయని చెబుతున్నారు.

ఏకంగా గుడి కట్టారు.

ఇది చాలా అరుదైన పుష్పం కావడం వల్ల దీంతో తయారైన ఔషధాలు అత్యంత ఖరీదైనవి. అప్పట్లోనే దీని ప్రాశస్థ్యాన్ని తెలుసుకున్న ఓ యూరోపియన్‌ మహిళ నీల్‌కురంజి పేరిట ఓ ఆలయాన్ని నిర్మించి, ఆమె కూడా హిందూమతాన్ని స్వీకరించారట.

ఇదీ చూడండి: 'జమ్ముకశ్మీర్‌లో విద్యుత్, నీటి రుసుములపై రాయితీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.