కర్ణాటక మంగళూరుకు చెందిన అక్షత, చేతన్.. భార్యాభర్తలు. ఇద్దరిదీ ఉపాధ్యాయ వృత్తి. తాజాగా ఇద్దరూ తమ తమ ప్రతిభతో ప్రపంచ రికార్డును సాధించారు.
మిమిక్రీలో అక్షత..
మంగళూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో అక్షత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె మిమిక్రీలో దిట్ట. ఒక్క నిమిషంలోనే.. 40 రకాల పక్షులు, జంతువుల గొంతును అనుకరించి ఎక్స్‌క్ల్యూజివ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది.
స్టెన్సిల్ కళలో చేతన్..
ఉళాయిబెట్టు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు చేతన్. 11 అడుగుల మహాత్మాగాంధీ బొమ్మను స్టెన్సిల్ కళ ద్వారా గీసిన చేతన్‌ను ఎక్స్‌క్ల్యూజివ్ వరల్డ్ రికార్డు వరించింది.
మరిన్ని లక్ష్యాలు..
ప్రపంచవ్యాప్తంగా 800 కుపైగా ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం 50 అడుగుల చిత్రాలను గీసేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్నాడు చేతన్. 16 గంటలు నిర్విరామంగా 300 పాటలను పాడి మరో రికార్డు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అక్షత.
అంతేకాదు.. అక్షత చదువుకున్న మారకాడ ప్రభుత్వ పాఠశాలకు ఆర్థిక సహాయం అందివ్వాలని నిర్ణయించుకుంది. చేతన్ కూడా ఇదే బాటలో నడవనున్నాడు.
ఇదీ చదవండి: 'పానిపట్' యుద్ధానికి సై అంటున్న సంజయ్, అర్జున్!