గర్భంతో ఉన్న ఏనుగు మృతి కేసులో కేరళకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు ఆ రాష్ట్ర అటవీ సంరక్షణ శాఖ ప్రధాన అధికారి సురేంద్ర కుమార్. పైనాపిల్లో పేలుడు పదార్థాలు పెట్టినట్లు 'తప్పుడు వార్తలు' వ్యాప్తి చేయటం సరి కాదని హితవు పలికారు.
" పైనాపిల్లో పేలుడు పదార్థాలు పెట్టటం అనేది తప్పుడు వార్త. దానిని నమ్మొద్దు. అది కేరళను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం. అటవీ జంతువులకు ఎవరూ నేరుగా ఆహారం పెట్టలేరు. వన్యప్రాణులను పారదోలేందుకు రైతులు బాణసంచా నింపి పెట్టిన ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు జరిగి ఉండవచ్చు. కానీ, జంతువులను ఆ విధంగా ట్రాప్ చేయటం అనేది తప్పు. కేరళ ప్రజలు జంతువులను ప్రేమిస్తారు. ఏనుగుల సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం కేరళ."
- సురేంద్రకుమార్, అటవీ సంరక్షణ విభాగం ప్రధాన అధికారి
ఇదీ చూడండి: ఏనుగు మృతిపై ఎన్జీటీ సీరియస్.. సుమోటోగా స్వీకరణ