గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విధ్వంస ఘటనలపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు పిటిషనర్, న్యాయవాది విశాల్ తివారి.
హింసకు కారకులైన వారితో పాటు జాతీయ జెండాను అగౌరవపరిచిన వారిపై ఎఫ్ఐర్ నమోదు చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు పిటిషనర్. అల్లర్ల కారణంగా న్యాయకార్యకలాపాలకు ఇబ్బంది ఎదురవుతోందని తెలిపారు.
హింసాత్మక ఘటనల్లో దిల్లీ పోలీసులు ఇప్పటికే 22 మందిపై ఎఫ్ఐర్ నమోదు చేశారు.
ఇదీ చదవండి:ఎర్రకోట ఘటనపై రంగంలోకి ఎన్ఐఏ!