అసోంకు చెందిన నిజ్రా ఫూకన్ 2500 కిలోమీటర్ల పాదయాత్రకు పూనుకుంది. పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా గతేడాది డిసెంబర్ 1న కాలి నడక మొదలెట్టిన ఆమె ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ చేరుకుంది.
పాదయాత్ర చేసి దేశ పౌరులకు పర్యావరణంపై అవగాహన కల్పించాలని సంకల్పించింది నిజ్రా. అందుకోసం.. అసోం సొడైదూ జిల్లా మొయిదమ్ నుంచి దిల్లీలోని రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది.
తారసపడిన వారందరికీ 'పర్యావరణ్ బచావ్' అనే సందేశాన్ని వినిపిస్తోంది.పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచడం ద్వారా, అందరం సురక్షితంగా ఉంటామని చెబుతోంది నిజ్రా.
"ఈ పాదయాత్ర వెనుక రెండు ముఖ్య కారణాలున్నాయి. మొదటిది.. ప్రపంచంలో అతిపెద్ద సమస్యేంటంటే పర్యావరణ కాలుష్యం.. దాని గురించి దేశ పౌరులను జాగృతపరచడం. ఇక రెండోది.. ప్రభుత్య చొరవ లేకుండా కేవలం సాధారణ జనం పర్యావరణాన్ని రక్షించలేరు. అందుకే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా."-నిజ్రా ఫూకాన్
ఇదీ చదవండి: ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో భారత్‌వి ఇవే..