దేశ రాజధాని దిల్లీ.. చలి గాలులకు అల్లాడిపోతోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఈరోజు ఉదయం 7 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్టోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. నగరంలోని బారాపుల్లా ఫ్లైఓవర్, సరిత విహార్ సహా పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది.
ఐదు విమానాల దారి మళ్లింపు..
పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్నందున దిల్లీ విమానాశ్రయంలో సర్వీసులు స్తంభించిపోయాయి. 5 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. విమానాల రాకపోకల్లో మార్పులపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు విమానయాన సంస్థలు పేర్కొన్నాయి.
22 రైళ్లు ఆలస్యం..
దిల్లీ సహా పలు ప్రాంతాల్లో పొగమంచు అలుముకున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. వెలుతురులేమి కారణంగా ఉత్తర రైల్వే పరిధిలో 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: సెంట్రల్ విస్టా: అన్నీ ఒక్క చోట.. దేశ రాజధాని ఘనత