ETV Bharat / bharat

చదివింది 'ఏడు'- ఆకాశమే హద్దుగా ఆవిష్కరణ అడుగులు! - తిరుపతి గ్యారేజీలో పనిచేసిన శాస్త్రవేత్త

చదివింది ఏడో తరగతే అయినా నూతన ఆవిష్కరణలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఓ వ్యక్తి. మొరాయించే ఏ యంత్రమైనా తన చేయి పడితే స్టార్ట్​ కావాల్సిందే అంటున్నాడు. మోటార్​ రంగంలో ఎంటెక్​ విద్యార్థులకు సైతం పాఠాలు చెప్పే నేర్పరిగా మారాడు. గాల్లో ఎగిరే యంత్రం చేయాలనే లక్ష్యంతో మెకానిక్ నుంచి శాస్త్రవేత్తగా మారాడు. ఇంతకీ ఆయనెవరో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.

the journey of padmakar
ఆకాశమే హద్దుగా ఎదిగి-శాస్త్రవేత్తగా మారి!
author img

By

Published : Jan 19, 2021, 11:57 AM IST

శాస్త్రవేత్తగా మారిన మెకానిక్

చదివింది ఏడో తరగతే. అయితేనేం... ఎంటెక్ విద్యార్థులకు ప్రయోగ పాఠాలు చెప్పే నైపుణ్యాలు తన సొంతం. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోయే అందరికీ.. పద్మాకర్ జీవితం ఆదర్శం. గాల్లో ఎగరాలన్న కల సాకారం చేసుకునేందుకు ఏకంగా హెలికాప్టర్‌నే నిర్మించేందుకు పూనుకున్న శాస్త్రవేత్త ఆయన. పెరిగిపోతున్న భూతాపాన్ని తగ్గించాలన్న సామాజిక బాధ్యతతో పెట్రో, డీజిల్ రహిత వాహనాల సృష్టికర్తగా నిలిచిన పర్యావరణ సైనికుడు ఈ పద్మాకర్.

పద్మాకర్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. పుట్టుకతోనే ఓ చర్మవ్యాధి బారిన పడిన పద్మాకర్‌... తోటి విద్యార్థులు గేలి చేయడంతో ఏడో తరగతితోనే చదువుకు దూరమయ్యాడు. క్రమంగా మెకానిక్ పాఠాలు స్వయంగా నేర్చుకున్నాడు. మోటార్ బైక్ అయినా, హెలికాప్టర్ అయినా... ఏ యంత్రం మొరాయించినా ఆయన చేయి పడితే స్టార్ట్ అవ్వాల్సిందే. అంతలా నైపుణ్యం సంపాదించాడు. చిన్న మెకానిక్‌గా ప్రస్థానం ప్రారంభించి, నేరుగా వాహనదారుల ఇంటికే వెళ్లి సేవలు అందించేవాడు.

"17 సంవత్సరాలు తిరుపతిలోని గ్యారేజీలో పనిచేశాను. తర్వాత కాకినాడ వచ్చేశాను. వైజాగ్ వచ్చి 25 సంవత్సరాలైంది. దాదాపు 18 ఏళ్లు షిప్స్ మీద పనిచేశాను. 1200 షిప్స్​తో పనిచేశాను. మొట్టమొదటి పరిశోధనగా బ్యాటరీ బైక్ తయారుచేశాను. అది చేసి, 13 సంవత్సరాలైంది."

-పద్మాకర్, శాస్త్రవేత్త.

వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు తనవంతు బాధ్యతగా... బ్యాటరీతో నడిచే కారును రూపొందించాడు పద్మాకర్. అప్పటినుంచీ బ్యాటరీ, సౌరశక్తితో నడిచే 600 వాహనాలు తయారు చేశాడు. తెలుగురాష్ట్రాల్లోని వందలాది ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు ప్రయోగ పాఠాల కోసం ఆ వాహనాలు ఉపయోగపడుతున్నాయి.

"గాల్లో 20 అడుగుల ఎత్తు వరకూ అనుమతి ఉంది. అతి త్వరలో ఎగరాలని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని, ఎగరాలన్న కోరిక నాకుంది. విశాఖపట్నానికి పేరు తేవాలని, ఇంజనీరింగ్ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు నేర్పాలన్న చిరకాల వాంఛ ఉంది నాకు."

-పద్మాకర్, శాస్త్రవేత్త.

విశాఖపట్నంలో భారత నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు మొరాయిస్తే పద్మాకర్ మరమ్మతులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓ హెలికాప్టర్‌ను తయారుచేసి, విశాఖ వీధుల్లో తిప్పడమే జీవితాశయమని చెప్తున్నాడు ఈ పెద్దాయన. తన ఆవిష్కరణల కోసం పద్మాకర్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశాడు.

"వైజాగ్‌లోని దాదాపు అన్ని ఇంజినీరింగ్ కళాశాలలకు కావల్సిన మెకానికల్ ప్రాజెక్టులు మేం చేశాం. పద్మాకర్ చేసేదాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఆయనతోపాటే కలిసి ప్రయాణం చేస్తున్నాను. ఆయన ఎలా చేయమంటే అలా చేస్తూ నేర్చుకుంటున్నాను. డబ్బులు మిగిలినా మిగలకపోయినా.. నలుగురికీ ప్రాజెక్టుల పరంగా నాలెడ్జ్​ అందించాలన్నదే ఆయన తపన."

-చంద్రమోహన్, పద్మాకర్ సహాయకుడు.

పద్మాకర్ నైపుణ్యాలు, ఆవిష్కరణలు తమకు గర్వకారణమని అంటున్నారు ఆయన కుటుంబసభ్యులు.

"నాన్న మా చిన్నప్పటినుంచీ చాలా ప్రాక్టికల్​గా ఉండేవారు. ఏ వస్తువునైనా ఏవిధంగా వాడుకోవచ్చు, అది పర్యావరణానికి ఉపయోగపడేలా ఎలా మార్చవచ్చు అనే ఆలోచించేవారు. చిన్నచిన్న ప్రాజెక్టులు చేసేవారు. ప్రతిదానిపైనా ప్రయోగం చేసేవారు. మనకెలా ఉపయోగపడుతుంది, పర్యావరణానికెలా ఉపయోగపడుతుంది అని ఆలోచించేవారు. అలా చాలా చేశారు."

-పద్మాకర్ కుమార్తె

"ఈ కారు చాలా సౌలభ్యంగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. వాట్సాప్‌లో వీడియోలు చూసి, నా మిత్రులందరూ ..లహరీ! మీ తాతయ్య అది చేశారు, ఇది చేశారు, ఆయన శాస్త్రవేత్త కదా అని అడుగుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది."

-లహరి, పద్మాకర్ మనమరాలు.

ప్రస్తుత సాంకేతిక విద్యారంగంలో ప్రయోగాత్మకంగా విద్య నేర్పే విధానం కనుమరుగు అవుతోంది, అందుకే ఈ ఆవిష్కరణలతో విద్యార్థులకు మోటార్ రంగంలో పాఠాలు బోధించడం సులువు అని పద్మాకర్ చెప్తున్నారు. అందుకే అనేక ఆవిష్కరణలు చేసి విద్యార్థులకు అందిస్తున్నట్టు పద్మాకర్ చెప్తున్నాడు. భవిష్యత్ లో సౌర శక్తీ తో వాహనాలు నడిచే రోజులు వస్తాయని అందుకే తన ఆవిష్కరణలు వచ్చే తరాలకు సైతం వినియోగించేలా రూపొందిస్తున్నారు. ఎప్పటికైనా తన వల్ల విశాఖ నగరానికి పేరురావాలని కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి:ఇకపై 'పరాక్రమ్ దివస్'గా నేతాజీ జయంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.