ETV Bharat / bharat

ఆటో డ్రైవర్​గా మారిన డాక్టర్​.. కారణమిదే... - Auto Driver news

కర్ణాటక దావనగరేకు చెందిన ఓ వైద్యాధికారి.. మంచి జీతం, గౌరవప్రదమైన జీవితాన్ని వదిలి ఆటో డ్రైవర్​గా మారారు. 24 ఏళ్లుగా జిల్లా ఆరోగ్య శాఖలో సేవలందించిన ఆయన ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునేందుకు కారణం ఏమిటి?

The Health Officer, now became Auto Driver
ఆటో డ్రైవర్​ అవతరామెత్తిన డాక్టర్
author img

By

Published : Sep 9, 2020, 1:57 PM IST

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులను వేధింపులకు గురిచేసే ఘటనల గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. పై అధికారుల తీరుతో విసిగిపోయిన కొందరు తమ ఉద్యోగాన్ని వదిలి ఏదో చిన్న పని చేసుకుంటూ జీవితం గడుపుతూ కనిపించిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి కోవకు చెందినవారే కర్ణాటక దావనగరేకు చెందిన ఎంహెచ్​ రావీంద్రనాథ్​. కానీ ఆయన సాధారణ ఉద్యోగి కాదు. జిల్లా స్థాయిలో విధులు నిర్వర్తించిన డాక్టర్.

The Health Officer, now became Auto Driver
డాక్టర్​ ఎంహెచ్​ రావీంద్రనాథ్​.

ఉన్నతాధికారుల వేధింపులతో విసిగిపోయిన రవీంద్రనాథ్​ తన వృత్తిని వదిలి ప్రస్తుతం ఆటో డ్రైవర్​గా మారారు. 'ఐఏఎస్​ అధికారుల వల్ల వచ్చిన కష్టాల జీవితం' అని తన ఆటో ముందు రాసి ఉంటుంది.

ఏం జరిగింది?

బళ్లారి జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో జిల్లా వ్యాక్సిన్​ అధికారిగా 24 ఏళ్లు విధులు నిర్వర్తించారు రవీంద్రనాథ్​. అయితే.. సాంకేతిక బిడ్డింగ్ రికార్డుల్లో అవకతవకలు జరిగాయని 2019, జూన్​ 6న సస్పెండ్​ చేశారు అధికారులు.

ఆటోపై తన ఆవేదనను తెలిపిన డాక్టర్​

ఐఏఎస్​ అధికారుల వేదిస్తున్నట్లు ఆటోపై రాసిన డాక్టర్​

రెండు సార్లు అనుకూలంగా తీర్పు..

క్లర్క్​ చేసిన పొరపాటుకు తాను బలయ్యాయన్నది రవీంద్రనాథ్​ వాదన. సస్పెండ్​ అయిన నాలుగు రోజుల తర్వాత బెల్గాంలోని కర్ణాటక అప్పీలేట్​ ట్రైబ్యునల్​ను(క్యాట్​) ఆశ్రయించారు ఆయన​. అన్ని రకాల పత్రాలను సమర్పించగా.. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అనంతరం కలబురిగి జిల్లాలోని సెడమ్​ ఆసుపత్రిలో వైద్యుడిగా నియమించింది క్యాట్​. కానీ అధికారులు పోస్టింగ్​ ఇవ్వలేదు. మరోమారు క్యాట్​ను ఆశ్రయించగా ఆయనకే అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రాలేదు.

అధికారుల తీరుతో విసిగిపోయిన రవీంద్రనాథ్​.. ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇన్నాళ్లు డాక్టర్​గా సేవలందించిన ఆయన.. ప్రస్తుతం ఆటో డ్రైవర్​గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన గురించి తెలిసిన ఆ ప్రాంతంలోని ఆటో డ్రైవర్లు.. రవీంద్రనాథ్​కు అన్ని విధాల సాయం చేస్తామని చెబుతున్నారు.

ఆటో నడుపుతోన్న డాక్టర్​ రవీంద్రనాథ్​

ఇదీ చూడండి: మహారాష్ట్ర హోంమంత్రికి మరోమారు బెదిరింపు కాల్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.