ఉదయం వివాహం జరుగుతుందనగా.. పీటల మీద కూర్చునే పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. ముందురోజు రాత్రి జరిగిన విందులో కనిపించిన ఆ వ్యక్తి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కర్ణాటక చిక్కమగళూరులోని తారికారే తాలుగాలో ఈ వ్యవహారం జరిగింది.
నవీన్, సింధు అనే యువతీయువకులకు పెద్దలు వివాహం నిశ్చయించారు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. అతిథులను ఆహ్వానించారు. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించారు. అయితే, నవీన్ అనే యువకుడు వేరే యువతితో ప్రేమలో ఉన్నాడు. పెళ్లి ఆపేస్తానని యువతి హెచ్చరించడం వల్లే నవీన్ పారిపోయాడని సమాచారం.
ఇక.. తెల్లారితే పెళ్లి అని ఎన్నో ఆశలతో ఉన్న సింధు జీవితం ఏమవుతుందో అని అంతా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి బాధను అర్థం చేసుకున్న చంద్రు అనే వ్యక్తి వివాహానికి ముందుకొచ్చాడు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు చంద్రు.
ఇదీ చదవండి: బాలీవుడ్ సినిమాను తలపించేలా.. స్ట్రెచర్‌పైనే పెళ్లి!