జాబిల్లి దక్షిణ ధ్రువం రహస్యాలను వెలికి తీసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2లో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్‌కు చెందిన తొలి కక్ష్యను విజయవంతంగా తగ్గించినట్లు ఇస్రో వెల్లడించింది.
ల్యాండర్‌ను అత్యంత సున్నితంగా చంద్రుడిపై కక్ష్యలోకి దింపేముందు.. ఈ కక్ష్యను తగ్గించినట్లు ఇస్రో తెలిపింది. ఆన్‌బోర్డు ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగించి.. ఉదయం 8 గంటల 50 నిమిషాల నుంచి 9 గంటల 45 నిమిషాల వరకు ల్యాండర్.. తొలి కక్ష్య తగ్గింపు ప్రక్రియ చేపట్టినట్లు వివరించింది.
బుధవారం మరోసారి కక్ష్యను తగ్గించిన తర్వాత ఈనెల 7వ తేదీ తెల్లవారు జామున ఒంటి గంటా 55 నిమిషాలకు ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దింపుతామని ఇస్రో వెల్లడించింది.
ఇదీ చూడండి: చంద్రయాన్ 2: ఆర్బిటర్ నుంచి విడిపోయిన 'విక్రమ్'