సియాచిన్‌లో మంచు కింద సైనికులు చిక్కుకున్న ఘటన విషాదాంతమైంది. మంచు మీద పడి నలుగురు భారత సైనికులు, ఇద్దరు సహాయకులు మృతిచెందారు. సోమవారం మధ్యాహ్నం సియాచిన్ గ్లేసియర్‌లో 20 వేల అడుగుల ఎత్తులో అవలాంచి (మంచు తుపాను) ఏర్పడింది. దీంతో ఎనిమిది మంది ఇందులో చిక్కుకున్నారు. ఈ సంఘటన ఉత్తర హిమనీనదం చోటుచేసుకున్నట్లు సమాచారం. భారీ మంచు తుపాను ఆర్మీ పోస్ట్‌ను తాకడం వల్ల ఈ పెను విషాదం జరిగింది.
పెట్రోలింగ్‌లో భాగంగా సైనికులతో పాటు సహాయకులు వెళ్లడం వల్ల మంచు తుపానులో చిక్కుకున్నారు. సియాచిన్ ప్రపంచంలో అతిఎత్తైన యుద్ధభూమి. ఇక్కడ పహారా కాచే బలగాలకు నిత్యం నరకమే.
ఇదీ చూడండి: రోడ్డుపై 'ట్రాఫిక్ నియమాల డ్యాన్స్' చూశారా?