ETV Bharat / bharat

ఆ రైతులు ఏమైనా పాకిస్థాన్​ నుంచి వచ్చారా?: హజారే

నూతన వ్యవసాయ చట్టాలపై పోరాటం చేస్తోన్న రైతులకు తన మద్దతు ప్రకటించారు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే. మోదీ సర్కారు అన్నదాతల ఉద్యమంపై నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. కేంద్రంపై పలు ప్రశ్నలు సంధించారు.

anna hazare
ఆ రైతులు ఏమైనా పాకిస్థాన్​ నుంచి వచ్చారా?: హజారే
author img

By

Published : Dec 1, 2020, 10:35 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలపై పంజాబ్​, హరియాణా సహా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరగలేదు. రైతుల నిరసనలపై కేంద్ర నిర్లక్ష్యం వహిస్తుందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కేంద్రంపై విమర్శలు చేశారు. అన్నదాతల ఉద్యమానికి పూర్తి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

రైతుల ఉద్యమానికి హజారే మద్దతు

ఓట్లు అడిగినప్పుడు లేదా?

ఎన్నికలు వస్తే రైతుల దగ్గరకు నేరుగా వెళ్లి ఓట్లు అడుగుతారు. మరి ఇప్పుడు పెద్ద ఎత్తున రైతులు నిరసన చేస్తుంటే ఎందుకు వెళ్లి చర్చించడం లేదు. దిల్లీలో నిరసన చేస్తోన్న అన్నదాతలు ఏమైనా పాకిస్థాన్​ నుంచి వచ్చారా?

- అన్నా హజారే, సామాజిక ఉద్యమకారుడు

సంపూర్ణ మద్దతు...

అన్నపూర్ణ అయిన భారత దేశంలో రైతుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వైఖరి ఆమోదయోగ్యం కాదు. ఎందుకు రైతులపై జలఫిరంగులు ప్రయోగించారు. ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. అయినా అన్నాదాతలు వెన్ను చూపకుండా పోరాటం చేస్తున్నారు. దిల్లీ సరిహద్దులో హింస చెలరేగితే ఎవరిది బాధ్యత? రైతులు చేస్తున్న ఈ ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను.

- అన్నా హజారే, సామాజిక ఉద్యమకారుడు

కొనసాగుతున్న నిరసన...

దిల్లీ సరిహద్దులో రైతుల నిరసన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్​షా.. అన్నదాతలతో చర్చించేందుకు ఆహ్వానం పంపినప్పటికీ రైతులు తిరస్కరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.