ETV Bharat / bharat

'ఉగ్రవాదులతో పీఓకే ఫుల్​- ఏ క్షణమైనా భారత్​లోకి...' - లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు

భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత్​లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సైనికాధికారులు వెల్లడించారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని శిబిరాలన్నీ ముష్కరులతో నిండిపోయినట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్​లో చనిపోయిన ఉగ్రవాదుల స్థానాన్ని భర్తీ చేసే విధంగా చొరబాట్లకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.

terrorist
కశ్మీర్ ఉగ్రవాదం
author img

By

Published : May 31, 2020, 3:06 PM IST

Updated : May 31, 2020, 3:33 PM IST

పెద్ద ఎత్తున ముష్కరులు భారత్​లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్​ రాజు వెల్లడించారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని శిబిరాలన్నీ ఉగ్రవాదులతో నిండిపోయినట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల సంఖ్య తగ్గిపోయిందని, వారి స్థానాన్ని భర్తీ చేసే విధంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

కశ్మీర్​లో శాంతిభద్రతల సమస్య లేదని చెప్పిన ఆయన.. ఈ విషయం పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు.

"ఉగ్రవాదం వెన్నెముక దాదాపుగా విరిగిపోయింది. కశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత విజయవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉంది. చనిపోయిన ముష్కరుల స్థానాన్ని భర్తీ చేసే విధంగా సరిహద్దు దాటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్​లో ఉన్న అన్ని క్యాంపులు, దాదాపు 15 లాంచ్​ ప్యాడ్లు ఉగ్రవాదులతో నిండిపోయి ఉన్నాయి. పాకిస్థాన్​ ఆర్మీ సహాయంతో భారత్​లోకి చొచ్చుకురావడానికి సిద్ధంగా ఉన్నారు."

-లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు, ఆర్మీ కమాండర్

దాదాపు 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని ఎగదోస్తుందన్నారు లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు. ఉగ్రవాదులు భారత్​లోకి ప్రవేశించేందుకే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని చెప్పారు. అయితే ఈ ప్రయత్నాలన్నింటికీ భారత్ దీటుగా జవాబిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో తమ అజెండాను ముందుకు తీసుకెళ్లలేక పాకిస్థాన్ చతికిలపడిందని పేర్కొన్నారు.

'వారిని వదిలేది లేదు'

భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేతబట్టిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారిని అడ్డుకునేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని తెలిపారు.

"కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తూ ఉంటే.. పాకిస్థాన్​ మాత్రం నియంత్రణ రేఖ వెంబడి ఘర్షణ వాతావరణాన్ని మరింత పెంచుతోంది. వారి ప్రయత్నాలను అడ్డుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది."

నాయకత్వ శూన్యత వల్లే

ఉగ్రవాద సంస్థలకు ప్రస్తుతం నాయకత్వ శూన్యత ఉందని అన్నారు జనరల్ బీఎస్ రాజు. రియాజ్ నైకూ, జునైద్ అష్రఫ్ షెరాయి సహా గత ఏడాది కాలంలో అన్ని ఉగ్రవాద సంస్థల నాయకులను భారత సైన్యం మట్టుబెట్టినట్లు తెలిపారు.

"ఇప్పుడు ఉగ్రవాదుల్లో నాయకత్వ శూన్యత ఉంది. మరోవైపు, మనుగడ కోసం పోటీ పడుతున్న ఉగ్ర సంస్థలు, తమ ఉనికిని విస్తరించాలనుకుంటున్న ఉగ్ర సంస్థల మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్నాయి. ఈ భూభాగంపై పట్టుకోల్పోతామన్న భయంతో పాకిస్థాన్.. ఉగ్రవాదులను దేశంలోకి ఎగదోస్తోంది. "

ఇదీ చదవండి: మోదీ 'జీవిత చరిత్ర'పై కొత్త పుస్తకం విడుదల

Last Updated : May 31, 2020, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.