ETV Bharat / bharat

పాంగాంగ్​పై చైనా తొండి- తగ్గాల్సిందేనని భారత్​ పట్టు - ఇండో చైనా

సరిహద్దులో చైనా వైఖరి మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు శాంతి స్థాపనకు సిద్ధమంటూనే.. మరోవైపు సైన్యాన్ని వెనక్కి తీసుకునే విషయంలో నిబద్ధతను పాటించడం లేదు. ముఖ్యంగా పాంగాంగ్​ ప్రాంతంలో తన బలగాలను కొనసాగిస్తూనే ఉంది. ఫలితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు.

Tensions at border continues as China refuses to withdraw its army from Pangong lake
ఉద్రిక్తతల వేళ పాంగాంగ్​ సరస్సుపై పట్టు వీడని చైనా
author img

By

Published : Aug 3, 2020, 6:42 AM IST

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి బలగాలను ఉపసంహరించి, శాంతిని పునరుద్ధరిద్దామంటూ చైనా చెబుతున్న మాటల్లో నిజాయితీ కనిపించడంలేదు. సైన్యాన్ని వెనక్కి తీసుకునే విషయంలో నిబద్ధతను ప్రదర్శించడంలేదు. పాంగాంగ్‌ ప్రాంతంలో తన బలగాలను కొనసాగిస్తోంది. అక్కడి ప్రతిష్టంభనపై భారత్‌తో చర్చించేందుకూ ఇష్టపడటంలేదు. ఎల్‌ఏసీని ఏకపక్షంగా మార్చాలన్న ఆ దేశ దుర్బుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంలేదు. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించేందుకు రెండు దేశాల సీనియర్‌ సైనిక కమాండర్లు ఆదివారం కీలక చర్చలు జరిపారు.

కొద్ది నెలలుగా భారత్‌, చైనాల మధ్య ఎల్‌ఏసీ వెంబడి పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలూ భారీగా సైనికులు, యుద్ధవిమానాలు, ట్యాంకులు, శతఘ్నులను మోహరించాయి. ఉన్నత స్థాయిలో చర్చల అనంతరం.. ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించాలని నిర్ణయించాయి. ఈ మేరకు పలు చోట్ల సైన్యాలు వెనక్కి మళ్లాయి.

గల్వాన్‌ లోయలో గస్తీ కేంద్రం 14, హాట్‌ స్ప్రింగ్స్‌లోని గస్తీ కేంద్రం 15 వద్ద.. ఒప్పందం మేరకు బలగాలను చైనా ఉపసంహరించింది. సమస్యాత్మక గోగ్రా పోస్టు వద్ద ఉన్న 'గస్తీ కేంద్రం 17ఎ' వంటి చోట్ల ఆ దేశ బలగాల ఉపసంహరణ నెమ్మదించింది. అయితే పాంగాంగ్‌లోని 'ఫింగర్‌ కాంప్లెక్స్' అంశమే భారత్‌కు ఎక్కువగా చికాకు కలిగిస్తోంది. ఇక్కడ ఒప్పందం మేరకు.. అదనపు బలగాలను వెనక్కి తీసుకోవడానికి డ్రాగన్‌ ససేమిరా అంటోంది.

ఇదీ చూడండి:- 'ఫింగర్​ ఏరియాలో బలగాల ఉపసంహరణపైనే చర్చ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.