ETV Bharat / bharat

'ఆ లావాదేవీలు చూపాల్సిన అవసరం లేదు' - statement of financial transactions

ఆదాయపు పన్ను రిటర్నులలో అధిక విలువైన లావాదేవీలను చూపించాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. ఆర్థిక లావాదేవీల వివరాలను రిటర్నులలో ప్రస్తావించాలనే ప్రతిపాదన జరుగుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించాయి.

Taxpayers not required to disclose high-value transactions in ITR
'రిటర్నులలో ఆ లావాదేవీలు చూపాల్సిన అవసరం లేదు'
author img

By

Published : Aug 17, 2020, 9:26 PM IST

అధిక విలువ కలిగిన లావాదేవీలను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్నులలో చూపించాల్సిన అవసరం లేదని ఆ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

రూ. 20 వేలకు పైబడిన హోటల్ చెల్లింపులు, రూ. 50 వేల కన్నా ఎక్కువ జీవిత బీమా ప్రీమియం, రూ. 20 వేలకుపైన వైద్య బీమా ప్రీమియం, లక్షకు మించిన పాఠశాలల ఫీజుల వంటి ఆర్థిక లావాదేవీల వివరాలను రిటర్నులలో ప్రస్తావించాలనే ప్రతిపాదన జరుగుతున్నట్లు వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు.

"ఆదాయపు పన్ను రిటర్నుల ఫారాలను సవరించే ప్రతిపాదన లేదు. అధిక విలువ కలిగిన లావాదేవీలను పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులలో పొందుపర్చాల్సిన అవసరం లేదు."

-అధికార వర్గాలు

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అధిక విలువ కలిగిన లావాదేవీలను తృతీయ పక్షం(థర్డ్ పార్టీ) ఆర్థిక సంస్థలే ఐటీ శాఖకు నివేదిస్తాయి. అయితే ఈ సమాచారం పన్ను చెల్లించని వ్యక్తులను గుర్తించేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని, అంతేకానీ, నిజాయతీ పన్ను చెల్లింపుదారుల వ్యవహారాలను పరిశీలించేందుకు కాదని అధికారులు స్పష్టం చేశారు.

పాన్ అనుసంధానంతో

మరోవైపు, అధిక విలువైన లావాదేవీల కోసం ఆధార్/పాన్ అనుసంధానించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు గుర్తు చేశారు. ఫలితంగా ఈ లావాదేవీలను మూడో పక్షం వ్యక్తులు ఆదాయ పన్ను శాఖకు వెల్లడిస్తారని తెలిపారు.

"స్వచ్ఛంద అంగీకారంపైనే ఐటీ శాఖ ఆధారపడి పనిచేస్తుందని, కాబట్టి థర్డ్ పార్టీలు, ఆర్థిక లావాదేవీల నివేదిక (ఎస్​ఎఫ్​టీ) ద్వారా సేకరించే సమాచారమే ఎగవేతదారులను పట్టుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి."

-అధికార వర్గాలు

ప్రస్తుతం నగదు డిపాజిట్లు/ఉపసంహరణ, స్థిరాస్తుల అమ్మకం/కొనుగోళ్లు, క్రెడిట్ కార్డు చెల్లింపులు, షేర్లు, డిబెంచర్లు, విదేశీ కరెన్సీ, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు వంటి సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ సేకరిస్తోంది. అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు, ఫండ్స్-బాండ్స్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్​ల నుంచి డేటాను సమీకరిస్తోంది.

ఇదీ చదవండి: దాడి చేసిన కొద్ది గంటల్లోనే ఇద్దరు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.