ఓటర్లకు పంచిపెట్టడం కోసం ఆయా ప్రాంతాలకు తరలించేందుకు డబ్బును సంచుల్లో సిద్ధంగా ఉంచారని ఐటీ అధికారులు తెలిపారు. ఏ వార్డుకు, ఏ డివిజన్‌కు ఎంత తరలించాలనే వివరాలు సంచులపై రాసి ఉందని చెప్పారు. తమిళనాడులోని లోక్‌సభ స్థానాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనుంది.
తమిళనాడులో మూడు రోజులుగా ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే, డీఎంకే కోశాధికారి దురైమురుగున్ నివాసం, విద్యా సంస్థలు సహా పాటు పలు చోట్ల గత శుక్ర, శనివారం ఐటీ అధికారులు సోదాలు చేశారు. అప్పుడు రూ.10లక్షల 50వేలు పట్టుకున్నారు.
గోదాముకు 11కోట్ల53లక్షల నగదును మార్చి 29, 30 తేదీల్లో తరలించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ తేదీల్లో దురైమురుగన్‌కు చెందిన ఇళ్లు, కళాశాల సహా కొన్ని చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. అక్కడి నుంచి నగదును గోదాముకు తెచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.
వేలూరు లోక్‌సభ అభ్యర్థిగా దురైమురుగన్ కుమారుడు కదిర్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారనే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో నగదును పట్టుకున్నారు.