అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి(84) ఆరోగ్యం మరింత విషమించిందని డాక్టర్లు వెల్లడించారు. మూత్రపిండాల పనితీరు మెరుగయ్యేందుకు సుమారు 6 గంటలపాటు డయాలసిస్ చేసినా.. ఆరోగ్య స్థితిలో మాత్రం ఏ మార్పులు కనిపించలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
సార్(తరుణ్ గొగొయి ) ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము.
-డాక్టర్ అభిజిత్ శర్మ
తరుణ్ గొగొయి ఆగస్టు 25న కరోనా బారినపడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న అనంతరం.. అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న గువాహటి మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేరారు. అయితే.. గత శనివారం(21వ తేదీ) ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ నేపథ్యంలో రాబోయే 48 గంటలు కీలకమని వైద్య వర్గాలు ప్రకటించాయి.