ETV Bharat / bharat

'మహా' విజృంభణ.. కరోనాతో ఒక్కరోజే 245మంది మృతి - corona latest news

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్​ రాష్ట్రాల్లో వైరస్​ ఉద్ధృతి ఆగడం లేదు. మహారాష్ట్రలో ఒక్కరోజే దాదాపు 4,878 కొత్త కేసులు నమోదయ్యాయి.

Tamilnadu
తమిళనాడులో కరోనా ఉద్ధృతి
author img

By

Published : Jun 30, 2020, 6:37 PM IST

Updated : Jun 30, 2020, 9:59 PM IST

దేశంలో కొవిడ్​-19 ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాలపై పంజా విసురుతోంది. రోజురోజుకు కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5.60 లక్షలు దాటింది, దాదాపు 17వేల మంది మరణించారు.

మహా విజృంభణ..

మహారాష్ట్రలో కరోనా వైరస్​ కరాళ నృత్యం చేస్తోంది. మంగళవారం ఒక్కరోజే 4,878 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 245 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,74,761కి చేరింది. అందులో ప్రస్తుతం 75,979 మంది చికిత్స పొందుతున్నారు. 90,911 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 52.02 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తమిళనాడులో..

తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 3,943 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 90,167కు, మరణాల సంఖ్య 1,201కు చేరింది. 50,074 మంది కోలుకోగా, 38,889 మంది చికిత్స పొందుతున్నారు.

మంత్రికి కరోనా​..

తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అంబళగన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. సోమవారం దగ్గుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు మంత్రి. అయితే.. ఆయనకు ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, సిటీ స్కాన్​లోనూ సాధారణంగానే వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే.. రెండోసారి నమూనాలను పరీక్షించగా పాజిటివ్​గా తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు.

Tamilnadu Higher Education Minister KP Anbalagan
రాాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి

గుజరాత్​లో..

గుజరాత్​లో మంగళవారం మరో 620 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 20మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 32,446కు చేరగా.. 23,670 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. మొత్తం మృతుల సంఖ్య 1,848కి చేరింది.

బంగాల్​లో...

పశ్చిమ బంగాలో మంగళవారం 652మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 15 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 18,559, మరణాలు 668కి చేరాయి. ఇప్పటి వరకు 12,130 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. 5,761 మంది చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 65.35 శాతంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

రాజస్థాన్​లో..

రాజస్థాన్​లో వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. మంగళవారం కొత్తంగా 354 మందికి పాజిటివ్​గా తేలింది. 8మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 18,014, 413 మరణాలు సంభవించాయి.

హిమాచల్​ప్రదేశ్​లో..

హిమాచల్​ప్రదేశ్​లో కరోనా పంజా విసురుతోంది. మంగళవారం 338 కొత్త కేసులు బయటపడ్డాయి. నలుగురు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 14548కి చేరగా.. మృతుల సంఖ్య 236కు చేరింది.

పంజాబ్​లో..

పంజాబ్​లో మంగళవారం 150 కొత్త కేసులు బయటపడ్డాయి. ఆరుగురు మృతి చెందారు. మొత్తం కేసులు సంఖ్య 5568, మరణాలు 144కు చేరాయి.

జమ్ముకశ్మీర్​లో...

జమ్ముకశ్మీర్​లో వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 260 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. జమ్ము డివిజన్​లో 32, కశ్మీర్​ డివిజన్​లో 228 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 7497కు చేరగా ప్రస్తుతం 4722 మంది కోలుకున్నారు. మరో 2674 మంది చికిత్స పొందుతున్నారు.

ఝార్ఖండ్​లో..

ఝార్ఖండ్​లో నేడు 60 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2490కి చేరింది. 1884 మంది కోలుకున్నారు. 15 మంది మృతి చెందారు.

గోవాలో...

గోవాలో ఇవాళ కొత్తగా 64 మందికి వైరస్​ సోకింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 1315కు చేరాయి. ఇప్పటి వరకు 596 మంది కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: 'పెట్టుబడుల పేరుతో 'చైనా దొంగాట'పై దర్యాప్తు!'

Last Updated : Jun 30, 2020, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.