దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడు తండ్రికొడుకుల లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించారన్న కారణంతో పి. జయరాజు అతని కుమారుడు ఫెనిక్స్ను అరెస్టు చేసిన పోలీసులు తీవ్రంగా కొట్టారు. ఈ నేపథ్యంలో వారు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది పళనిస్వామి సర్కారు.
"కేసుకు సంబంధించి తమిళనాడు వ్యాప్తంగా విచారణ చేపట్టేందుకు సీబీఐకి ప్రత్యేక అధికారాలనిస్తూ గవర్నర్ కూడా తన సమ్మతిని తెలిపారు."
-ప్రభుత్వ నోటిఫికేషన్లోని భాగం
'మంచి నిర్ణయం'
కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తమిళనాడు హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిని కోర్టు.. ప్రభుత్వానిది ఆహ్వానించదగిన నిర్ణయమని చెప్పింది.
అయితే ఇప్పటికే ఈ ఘటనకు కారణమైన పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది తమిళనాడు ప్రభుత్వం.
ఇదీ చూడండి: 'అక్కడ జార్జి ఫ్లాయిడ్.. ఇక్కడ జయరాజ్-ఫెనిక్స్'