రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రధారణపై తమిళనాడు ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఉద్యోగాలకు హాజరయ్యేవారు ఇష్టారీతిలో దుస్తులు వేసుకురావటాన్ని నిషేధించింది. తమిళ సంస్కృతి, భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించే దుస్తులను మాత్రమే ధరించి కార్యాలయాలకు రావాలని ఆదేశించింది.
మహిళలు.. చీర, సల్వార్ కమీజ్, హుందాగా ఉండే రంగులో దుపట్టా కలిగిన చుడీదార్లు వేసుకోవాలని తెలిపింది. పురుషులు ఫార్మల్ చొక్కా, ఫార్మల్ ప్యాంట్ ధరించాలని పేర్కొంది.
ఇదీ చూడండి: 'అన్ని రాష్ట్రాల్లో హిందీ' పై నిర్ణయం తీసుకోలేదు: జైశంకర్