కరోనా బారిపడి చికిత్స పొందుతూ తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దొరైక్కన్ను(72) కన్నుమూశారు. ఈ నెల 13న శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడిన వెంటనే ఆయనను విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కావేరీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి... శనివారం రాత్రి 11.15 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
1948లో తంజావూరు జిల్లా రాజగిరిలో దొరైక్కన్ను జన్మించారు. 3 సార్లు పాపనాశం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016లో ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దొరైక్కన్నుకు భార్య, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో తెరుచుకోనున్న థియేటర్లు