ఉత్తరాఖండ్ రాజధాని దెహ్రాదూన్‌లోని ఓ కత్తుల తయారీ కర్మాగారం ఇది. నలభై ఏళ్లుగా భారత సైన్యానికి సంప్రదాయ ఆయుధాలైన తల్వార్, కుక్రీ కత్తులను అందించటంలో ఖ్యాతి గడించింది. ఇప్పుడు ఆ పేరు విశ్వవ్యాప్తమైంది. బ్రిటిష్ ఆర్మీ పాసింగ్ ఔట్ పరేడ్‌లో బహూకరించే తల్వార్ ఇక్కడే తయారవుతోంది.
నాణ్యమైన కత్తులకు చిరునామాగా మారిన 'సతీశ్ కుక్రీ' కర్మాగారాన్ని నసీం అలీ స్థాపించారు. ఇప్పుడు ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా తదితర దేశాలకు కత్తులను ఎగుమతి చేస్తున్నారు.
తాజాగా బ్రిటన్ నుంచి వచ్చిన ప్రత్యేకమైన ఆర్డర్‌ను ఎంతో గౌరవంగా భావిస్తున్నారు అలీ. వచ్చే నెలలో 200 తల్వార్లను బ్రిటన్ వాయుసేనకు పంపించనున్నారు.
"వీటిని ఒక్కరోజులో తయారు చేయలేం. దశల వారీగా సిద్ధమవుతాయి. నెలకు 200 నుంచి 300 వరకు తయారు చేస్తాం. ఈ కత్తి బ్రిటన్ వాయుసేన కోసం తయారు చేసింది. వీటిని బ్రిటన్‌లో, మన దేశంలో వాడతారు. వీటిని పాసింగ్ ఔట్ పరేడ్‌లో బహూకరణ ఆయుధంగా ఉపయోగిస్తారు."
-నసీం అలీ, కర్మాగారం యజమాని
సాధారణ తల్వార్లతో పోలిస్తే ఇక్కడ తయారయ్యేవి బరువు తక్కువగా ఉంటాయి. బంగారు రంగు పిడితో కాంతులీనుతాయి.
ఇదీ చూడండి: 20 రూపాయల నోటుకు కొత్త రూపు