దిల్లీలో ఘర్షణలకు భాజపా నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ ప్రసంగాలు కారణమని దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు విచారించింది. అన్ని కోణాల్లో సునిశితంగా పరిశీలించి భాజపా నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశమై నిర్ణయం తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
ప్రత్యేక కమిషనర్‌కు ఆదేశాలు
పోలీసు కమిషనర్‌ను సంప్రదించి విద్వేషపూరిత వ్యాఖ్యలను నిజనిర్ధరణ చేసుకుని తుది నిర్ణయానికి రావాలని ప్రత్యేక కమిషనర్ ప్రవీర్ రంజన్‌ను ఆదేశించింది హైకోర్టు. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని వీడియోలను పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది.
పౌర వ్యతిరేక ఆందోళనలకు సంబంధించి కేంద్రం దాఖలు చేసిన మరో పిటిషన్‌ను విచారించింది కోర్టు. కేంద్రం వ్యాజ్యం ఆధారంగా ఆయా వర్గాలకు నోటీసులు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణను గురువారం చేపట్టనుంది.
ఇదీ చూడండి: గ్రౌండ్ జీరోలో డోభాల్- స్థానికుల్లో భరోసా నింపే యత్నం