ETV Bharat / bharat

'టేబుల్‌'పై దిగినట్టే విమానం దిగాలి.. లేదంటే అంతే!

టేబుల్​టాప్ రన్​వే.. విమానాలు దిగే రన్​వేకు రెండువైపులా చిన్నపాటి లోయ ఉండే వాటిని ఇలా పిలుస్తారు. ఇక్కడ ఏ మాత్రం అదుపుతప్పినా పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. సుదీర్ఘ అనుభవమున్న పైలట్లకూ ఇక్కడ విమానాలను ల్యాండింగ్ చేయడం చాలా కష్టం.

table top runway kerala kozikode air india mishap
'టేబుల్‌'పై దిగినట్టే విమానం దిగాలి.. లేదంటే అంతే!
author img

By

Published : Aug 8, 2020, 5:37 AM IST

ఒక టేబుల్‌ లాంటి రన్‌వే.. రన్‌వేకి ఇరువైపులా చిన్నపాటి లోయలా ఉంటుంది.. జాగ్రత్తగా విమానం ల్యాండ్ చేయాలి.. ఏమాత్రం తడబడినా విమానం రన్‌వే నుంచి జారిపోతుంది... వీటినే టేబుల్‌టాప్‌ రన్‌వే కలిగిన విమానాశ్రయాలు అంటారు.. తాజాగా విమాన ప్రమాదం జరిగిన కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయం కూడా ఇలాంటిదే.

సవాల్

దేశంలోని లేహ్‌,మంగళూరు, కోజికోడ్‌ విమానాశ్రయాలు టేబుల్‌టాప్‌ తరహకు చెందినవి. వీటిని కొండల మధ్యలోని పీఠభూముల్లో నిర్మించారు.. రన్‌వేకు ఒక పక్క గానీ లేదా రెండు వైపులా గానీ లోయలుంటాయి. ఏ మాత్రం అదుపుతప్పినా అంతే.. అందుకే సుదీర్ఘమైన వైమానిక రంగ అనుభవమున్న పైలట్లకు కూడా ఈ రన్‌వేలపై విమానాలను ల్యాండింగ్‌ చేయడం పెద్దసవాల్‌..

భయాలున్నాయి...

ఈ విమానాశ్రయాల రన్‌వేలను విస్తరించాలని గతంలోనే విమానయాననిపుణులు సూచించారు. 2010లో కర్ణాటకలోని మంగళూరు విమానశ్రయంలో విమానం ల్యాండింగ్‌ అవుతూ అదుపు కోల్పోవడంతో రన్‌వే నుంచి వెళ్లి కిందనున్న లోయలోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో 158 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ అదే టేబుల్‌టాప్‌ రన్‌వే కలిగిన కోజికోడ్‌ విమానాశ్రయంలో ప్రమాదం జరగడం గమనార్హం.

భారీ వర్షమే కారణమా?

విమానం దిగుతున్న సమయంలో కోజికోడ్ విమానాశ్రయంలో భారీగా వర్షం కురుస్తోంది. విమానం రన్‌వే దిగి జారుకొని వెళ్లిపోవడంతో ప్రమాదం జరిగివుంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన పైలట్‌కు సుదీర్ఘమైన విమానయాన అనుభవం ఉంది. ఆయన గతంలో ఎయిర్‌ఫోర్స్‌లో బాధ్యతలు నిర్వహంచి పలు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. టేబుల్‌ టాప్‌ రన్‌వే కావడంతో పాటు భారీ వర్షానికి విమానం రన్‌వే నుంచి కిందకు వెళ్లిపోయివుండవచ్చని పలువురు విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.