ఏప్రిల్ 5న రాత్రి తొమ్మిది గంటలకు లైట్లు ఆర్పే విషయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్. తొమ్మిది నిమిషాల పాటు లైట్లు ఆర్పితే విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే అవకాశం ఉందని.. దీంతో దేశం మొత్తం చీకటిమయం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ కారణంగా అవసరమైన విద్యుత్ ఉపకరణాలను పనిచేయనివ్వాలని దేశ ప్రజలకు సూచించారు.
"దేశవ్యాప్తంగా తొమ్మిది నిమిషాల పాటు లైట్లు, విద్యుత్ ఉపకరణాలు నిలిపేస్తే విద్యుత్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ఒకేసారి విద్యుత్ డిమాండ్‌లో తగ్గుదల, పెరుగుదల ఉండనున్న కారణంగా విద్యుత్ గ్రిడ్ ఫ్రీక్వెన్సీలో మార్పులు ఏర్పడతాయి. గ్రిడ్ కుప్పకూలే అవకాశం ఉంది. దీన్ని నివారించేందుకు ప్రజలు, విద్యుత్ పంపిణీ సంస్థలు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి."
-నితిన్ రౌత్, మహారాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి
ఏప్రిల్ 5న రాత్రి తొమ్మిది గంటలకు.. తొమ్మిది నిమిషాల పాటు లైట్లను ఆర్పేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కరోనా వైరస్‌పై దేశ ప్రజల ఐక్య పోరాటానికి సూచనగా లైట్లు ఆర్పి.. క్యాండిల్స్, మొబైల్ టార్చ్‌లను ప్రదర్శించాలని ప్రకటించారు. ఇలా విద్యుత్ నిలిపితే తలెత్తే ప్రతికూల పరిస్థితిపైనే స్పందించారు నితిన్ రౌత్.
ఇదీ చూడండి: వైరస్‌పై పోరులో 'జుగాడ్'- త్రీడీ ప్రింటర్‌తో మాస్కులు