ETV Bharat / bharat

'నిర్వహణ లోపాలతో సుదూర స్వప్నంగానే స్వచ్ఛభారతం' - ఈటీవీ భారత్

బహిరంగ మలవిసర్జన నుంచి భారత్ విముక్తి సాధించిందని ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ చెబుతుంటే... తాజాగా విడుదలైన జాతీయ గణాంకాలు మాత్రం గ్రామీణ భారతంలో 29 శాతం కుటుంబాలకు ఇప్పటికీ మరుగుదొడ్లు అందుబాటులో లేవని తేల్చిచెబుతున్నాయి. గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతాన్ని నిర్మించడంలో భాగంగా స్వచ్ఛభారత్ లక్ష్యాలను అందుకోవడానికి నాయకులందరూ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు. మొత్తం మీద అనుకున్నది సాధించామంటూ ఈ అక్టోబర్ 2న ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి.

swatch bharat is distant dream with management flaws
నిర్వహణ లోపాలతో సుదూర స్వప్నంగానే స్వచ్ఛభారతం
author img

By

Published : Dec 13, 2019, 7:28 AM IST

గ్రామీణ భారతం బహిరంగ మలవిసర్జన సమస్య నుంచి విముక్తమైందని అక్టోబరు రెండున ప్రధాని మోదీ ప్రకటించారు. 'స్వచ్ఛభారత్‌లో భాగంగా 60 నెలల్లో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి 60 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాం. ఈ విషయం తెలుసుకుని ప్రపంచం ఆశ్చర్యపోతోంది' అని ఆయన చెప్పారు. స్వచ్ఛభారత్‌ ద్వారా దేశంలో అద్భుత ప్రగతి సాధించినందుకు గానూ ఈ ఏడాది సెప్టెంబరులో బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ నుంచి 'గ్లోబల్‌ గోల్‌కీపర్‌' పురస్కారాన్ని ప్రధాని స్వీకరించారు. 76వ జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌)లో భాగంగా 'దేశంలో రక్షిత తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, గృహపరిస్థితులు' పేరిట జాతీయ గణాంక కార్యాలయం వెలువరించిన తాజా నివేదిక మాత్రం ప్రధాని మాటలకు భిన్నంగా ఉంది. గ్రామీణ భారతంలో 29 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులో లేవని ఆ నివేదిక తేల్చిచెప్పింది. ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లలో సగానికి సగం గ్రామీణ కుటుంబాలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఝార్ఖండ్‌, తమిళనాడు, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలదీ ఇదే పరిస్థితి! 'స్వచ్ఛభారత్‌'లో భాగంగా మరుగుదొడ్లను నిర్మించుకునే వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. కానీ, దేశవ్యాప్తంగా 17 శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే ఈ చేయూత లభించిందనే కీలక విషయాన్ని నివేదిక వెలుగులోకి తెచ్చింది.

ఎన్‌ఎస్‌ఎస్‌ ఫలితాలు ప్రభుత్వానికి మింగుడుపడనివి కావడంతో, ఆ నివేదికను బహిర్గతపరచడంలో ఆర్నెల్లకు పైగా జాప్యం జరిగింది. దేశంలో నిరుద్యోగిత రేటు 6.1 శాతానికి చేరిందన్న జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నియతకాలిక కార్మిక సర్వే ఫలితాల వెల్లడిలోనూ ఇలాంటి ఆలస్యమే చోటుచేసుకుంది. ఆ నివేదిక దాదాపు ఆర్నెల్ల తరవాత ప్రజల ముందుకు వచ్చింది. దేశంలోని పల్లెలన్నింటినీ విద్యుదీకరించామని గతేడాది ఏప్రిల్‌లో మోదీ చెప్పారు. ఆ తరవాత రెండు నెలలకు రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌తో కలసి నీతిఆయోగ్‌ విడుదల చేసిన ఓ 'ఉద్దేశ ప్రకటన పత్రం' గ్రామీణ భారతంలో 4.5 కోట్ల కుటుంబాలకు విద్యుత్‌ సౌకర్యం అందుబాటులో లేదని పేర్కొంది.

swatch bharat is distant dream with management flaws
జాతీయ నమూనా సర్వేలోని గణాంకాలు

అరకొర పరిశీలన

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా భావ్‌కేదీ గ్రామ పంచాయతీ కార్యాలయానికి దగ్గర్లో మలవిసర్జన చేశారని ఇద్దరు దళిత చిన్నారులను ఈ ఏడాది సెప్టెంబరులో ఓ మూక కొట్టి చంపింది. బాధిత కుటుంబానికి మరుగుదొడ్డి అందుబాటులో లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'స్వచ్ఛభారత్‌' సమాచార నిధి ప్రకారం ఆ భావ్‌కేదీ గ్రామం బహిరంగ మలవిసర్జన సమస్య నుంచి ఎప్పుడో బయటపడింది. స్వచ్ఛభారత్‌ లెక్కల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లాలోని ఏ గ్రామంలోనూ బహిరంగ మలవిసర్జన జరగడం లేదు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి బహిరంగ మలవిసర్జన జరగని గ్రామాలు చాలా ఉన్నాయి. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఏదైనా ఓ పల్లెను ఓడీఎఫ్‌ (బహిరంగ మలవిసర్జన రహితం)గా ప్రకటిస్తూ గ్రామసభ తీర్మానం చేస్తే, రెండంచెల పరిశీలన అనంతరం ప్రభుత్వం దాన్ని నిర్ధరించాలి. తృతీయపక్షం లేదా తన సొంత యంత్రాంగం ద్వారా ప్రభుత్వాలు ఈ పరిశీలన చేయించాలి. గ్రామసభ తీర్మానం తరవాత మూడు నెలలకు ఈ బృందాలు ఆ గ్రామానికి వచ్చి నిజంగానే బహిరంగ మలవిసర్జన ఆగిపోయిందా లేదా అన్నది పరిశీలించాలి. చాలా రాష్ట్రాల్లో ఈ పరిశీలనలు సక్రమంగా జరగడం లేదు. సెప్టెంబరు 26 నాటికి ఒడిశాలో 23,902 'ఓడీఎఫ్‌' గ్రామాల్లో మొదటి దశ పరిశీలనలు పూర్తయ్యాయి. 30వ తేదీ నాటికి ఈ సంఖ్య 55 శాతం పెరిగి 37 వేలకు చేరింది. అంటే నాలుగు రోజుల్లో 13 వేల గ్రామాల్లో పరిశీలన పూర్తిచేశారన్న మాట. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఈ విషయాన్ని నిర్ధరించాలంటే నెలకు పైగా పడుతుంది. 'ఓడీఎఫ్‌'గా ప్రకటించిన దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో రెండో దశ పరిశీలన జరిగినవి పాతిక శాతం లోపే ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 97 వేల 'ఓడీఎఫ్‌' పల్లెల్లో పది శాతం గ్రామాల్లో మాత్రమే రెండో పరిశీలన జరిగింది. ఒడిశాలోని 47 వేల గ్రామాల్లో ఏ ఒక్క దాంట్లోనూ రెండోసారి పరిశీలన జరగలేదు. మొత్తం పది రాష్ట్రాల్లో రెండోదశ పరిశీలన జరగలేదు. దాంతో పేరుకు ఆయా గ్రామాలు 'ఓడీఎఫ్‌' అయినా బహిరంగ మలవిసర్జన మాత్రం ఆగిపోలేదు. లక్ష్యాలను చేరుకోవాలన్న ఒత్తిడిలో పరిశీలనలకు సంబంధించిన విధివిధానాలను పాటించడం లేదు.

లక్ష్యం అందుకోవడానికి వేధింపులు

మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతాన్ని నిర్మించడానికి 'స్వచ్ఛభారత్‌' కార్యక్రమాన్ని చేపడుతున్నామని అయిదేళ్ల కిందట ప్రభుత్వం ప్రకటించింది. మహాత్ముడి 150వ జయంత్యుత్సవాలకు- అంటే ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి దేశాన్ని బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తం చేయాలన్నది ప్రభుత్వం చేసిన లక్ష్యనిర్దేశం. ఇందుకోసం నాయకులు యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు. మొత్తమ్మీద అనుకున్నది సాధించామంటూ ఈ ఏడాది అక్టోబరు రెండున ప్రకటించారు. ఈ అయిదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్‌ కోసం రూ.80 వేల కోట్లకు పైగా వెచ్చించాయి. 10.16 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని ప్రభుత్వ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి యంత్రాంగం పేదలను వేధించిందనే ఆరోపణలున్నాయి. 2017లో దేశంలో రెండు వారాల పాటు పర్యటించి, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన 'సమితి' ప్రత్యేక నివేదకులు లియో హిల్లర్‌ ఇదే మాట చెప్పారు. 'లక్ష్యాలను సాధించడానికి అధికారులు ప్రజలతో దుందుడుకుగా, అగౌరవకరంగా వ్యవహరించారు' అంటూ మరుగుదొడ్లు లేని వారికి రేషన్‌కార్డులు, విద్యుత్‌ కనెక్షన్లు తొలగించిన ఘటనలను ఉదహరించారు.

నీటి సదుపాయమే సమస్య

మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలం లేని నిరుపేదల విషయంలోనూ స్వచ్ఛభారత్‌పరంగా చేయూత లభించలేదు. 'మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి మాకు స్థలం లేదు. ఊళ్లోని సామూహిక మరుగుదొడ్లను వినియోగించుకోవాలని పంచాయతీ పెద్దలు చెప్పారు. మేము దాన్ని వినియోగించుకోవడం అగ్రవర్ణాల వారికి ఇష్టం లేదు. మేం అక్కడికి వెళ్లిన ప్రతిసారీ కొట్లాటలు జరుగుతున్నాయి' అని చెప్పారు హరియాణాలోని అమ్రోలీకి చెందిన దళితులు. వీరి సమస్య పరిష్కారం కాలేదు కానీ, హరియాణా మాత్రం 'ఓడీఎఫ్‌' రాష్ట్రంగా అధికార పత్రాల్లో నమోదైంది. ఆర్థిక, భూ సమస్యల కారణంగా మరుగుదొడ్లు నిర్మించుకోలేని వారికి ఉపయోగపడాల్సిన సామూహిక మరుగుదొడ్లు నివాసిత ప్రాంతాల నుంచి చాలా దూరంలో ఉంటున్నాయి. కొన్ని గ్రామాల్లో కిలోమీటరుకు పైగా దూరంలో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల నీటికొరతతో వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. 'నీళ్లు లేకపోవడంతో వేసవి కాలంలో గ్రామస్థుల్లో సగం మంది మరుగుదొడ్లను ఉపయోగించుకోలేకపోతున్నారు. దీంతో బహిరంగ మలవిసర్జనకు వెళ్లక తప్పట్లేదు' అని కనక్‌పూర్‌ గ్రామానికి చెందిన తరంగణీ మిశ్రా ఆవేదన వ్యక్తంచేశారు. 'మరుగుదొడ్లకు నీటి సదుపాయం కల్పించడమే అసలు సమస్య' అని బాలంగిర్‌ జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు.

పర్యావరణానికి హాని

'దేశంలో 96 లక్షల పొడి మరుగుదొడ్లు ఉన్నాయి. వీటిలో పోగుపడే మానవ విసర్జితాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయటం తప్ప మరో మార్గం లేదు' అంటారు రామన్‌ మెగసెసె పురస్కార గ్రహీత, 'సఫాయి కర్మచారి ఆందోళన్‌' సంస్థ జాతీయ సమన్వయకర్త బెజవాడ విల్సన్‌. పర్యావరణహితమైన రెండు గుంతల మరుగుదొడ్ల నిర్మాణాన్నే ప్రోత్సహిస్తున్నామని కేంద్రం చెబుతోంది. కానీ, స్వచ్ఛభారత్‌ కింద నిర్మితమైన మరుగుదొడ్లలో అత్యధికం ఒక గుంతవే కావడం గమనార్హం. 'మరుగుదొడ్లలో 50 క్యూబిక్‌ అడుగుల సామర్థ్యం గల రెండు గుంతలుండాలి. అయితే ఈ విషయాన్ని ఎవరూ పర్యవేక్షించడంలేదు' అని గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి ఎన్సీ సక్సేనా చెప్పారు. ఒక్క గుంత మరుగుదొడ్లు తొందరగా నిండిపోతాయి. ఆ వ్యర్థాలను తొలగించేవారు వాటిని సమీపంలోని నీటి వనరుల దగ్గర పడేస్తున్నారు. దాంతో కాలుష్య సమస్యలు ఉత్పన్నం కావడంతోపాటు అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి.

కాగితాల లెక్కలకు లేని పొంతన

గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం గతేడాది జులై 19న పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. 'భారతీయులందరికీ సంపూర్ణ పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలి, స్వచ్ఛ భారతాన్ని నిర్మించాలన్న జాతిపిత స్వప్నం సాకారమయ్యే రోజు ఇంకా సుదూరంగానే ఉంది' అని నివేదికలో స్పష్టంగా చెప్పింది. స్వచ్ఛభారత్‌కు సంబంధించి కాగితాల మీద లెక్కలకూ క్షేత్రస్థాయి పరిస్థితులకూ పొంతన లేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం వీటి గురించి అంతగా పట్టించుకోనవసరం లేదని, ఇతర అధ్యయనాల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో 'ఓడీఎఫ్‌'గా ప్రకటించిన గ్రామాల్లో రెండంచెల పరిశీలనను సక్రమంగా నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాలి. నీళ్లకు నోచుకోని మరుగుదొడ్లకు ఆ సదుపాయం కల్పించాలి. పర్యావరణహితమైన రెండు గుంతల మరుగుదొడ్లను మాత్రమే నిర్మించాలి. వ్యర్థాల నిర్వహణలో లోపాలను సరిదిద్దాలి. అప్పుడే అసలైన స్వచ్ఛభారతం ఆవిష్కృతమవుతుంది!

- శైలేష్‌ నిమ్మగడ్డ (రచయిత)

Varanasi (UP), Dec 13 (ANI): Soaring prices of onion across nation are burning holes not only in household but also in hotel budgets. Several hotels in Varanasi have put up posters asking customers to not demand onion-made food. Onions are being sold at more than Rs 100 per kg in several states. Many consumers have cut down their consumption keeping in mind the high prices of onion. In order to control the onion crisis, the government is importing over 11,000 tonnes of onions from Turkey.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.