ETV Bharat / bharat

కేంద్రమంత్రిని అడ్డుకున్న వామపక్ష విద్యార్థి సంఘాలు

author img

By

Published : Sep 19, 2019, 9:46 PM IST

Updated : Oct 1, 2019, 6:32 AM IST

కేంద్ర మంత్రి బాబుల్​ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. జాదవ్​పుర్​ విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించకుండా వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు గెరావ్​ చేశాయి. ఈ ఘటనపై బంగాల్​ గవర్నర్​ జయదీప్​ ధన్​ఖర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబుల్​ సుప్రియో
కేంద్రమంత్రిని అడ్డుకున్న వామపక్ష విద్యార్థి సంఘాలు

కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాబుల్‌ సుప్రియోకు కోల్‌కతాలో చేదు అనుభవం ఎదురైంది. జాదవ్​పుర్​ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ, ఆర్​ఎస్​ఎస్​ విద్యార్థి విభాగం నిర్వహించిన సెమినార్‌లో పాల్గొనేందుకు సుప్రియో వెళ్లగా.. వామపక్ష అనుబంధ సంఘాల విద్యార్థులు గెరావ్​ చేశారు.

గంటన్నర పాటు గందరగోళం

సుప్రియోను క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా గంటన్నరపాటు అడ్డుకున్నారు. నల్లజెండాలను ప్రదర్శిస్తూ.. సుప్రియోను వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ఈ గందరగోళంలో తోపులాట జరిగింది. చివరికి గట్టి బందోబస్తు మధ్య ఆడిటోరియానికి చేరుకున్నారు సుప్రియో. అనంతరం విద్యార్థుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

తిరిగి వెళుతుండగా ఉద్రిక్తత

కేంద్ర మంత్రి సుప్రియో తిరిగి వెళ్తుండగా విద్యార్థులు మళ్లీ అడ్డుకున్నారు. మంత్రికారు వెళ్లకుండా ఎస్​ఎఫ్​ఐ విద్యార్థులు చుట్టుముట్టారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ పరిస్థితుల్లో విశ్వవిద్యాలయం చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు.

గవర్నర్​ ఆగ్రహం

ఈ ఘటనపై గవర్నర్‌ జయ్‌దీప్‌ ధన్‌ఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనే స్వయంగా విశ్వవిద్యాలయానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి సుప్రియోను ఆయన కారులో తీసుకెళ్లారు.

అంతకుముందు ఈ ఘటనపై గవర్నర్‌ ధన్‌ఖర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాలెడేతో మాట్లాడారు. బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎస్... కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి: వాయుసేన నూతన అధిపతిగా ఆర్​కేఎస్​ బదౌరియా

Brussels (Belgium), Sep 18 (ANI): The European Union Parliament on September 18 called India and Pakistan to engage in direct dialogue on Kashmir. The parliament said that it is important to ensure a peaceful resolution of the issue. During the meeting, Member of European Parliament Fulvio Martusciello supported India by saying, "Pakistan has threatened to use nuclear arms. Pak is somewhere where terrorists have been able to plan bloody terrorist attacks in Europe without mentioning tremendous human rights violation in Pak."
Last Updated : Oct 1, 2019, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.