ETV Bharat / bharat

రిజర్వేషన్​ అనేది ప్రాథమిక హక్కు కాదు: సుప్రీం

తమిళనాడులోని మెడికల్​ కళాశాలల్లో ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్​ ఇవ్వాలన్న అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్​ అనేది ప్రాథమిక హక్కు కాదని వ్యాఖ్యానించింది. దాఖలు చేసిన వ్యాజ్యాలను వెనక్కి తీసుకుని.. మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

Supreme Court reservation
రిజర్వేషన్​ అనేది ప్రాథమిక హక్కు కాదు: సుప్రీంకోర్టు
author img

By

Published : Jun 11, 2020, 4:26 PM IST

రిజర్వేషన్‌ అనేది ప్రాథమిక హక్కు కాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. తమిళనాడు మెడికల్‌ కళాశాలల్లో ఓబీసీ అభ్యర్థుల కోటాపై పలువురు వేసిన పిటిషన్లను నేడు విచారించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం‌.. ఈ వ్యాఖ్యలు చేసింది.

రిజర్వేషన్ ఇవ్వనంత మాత్రాన అది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా పరిగణించరాదని చెప్పింది సుప్రీం. ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలంటూ తమిళనాడుకు చెందిన సీపీఐ, డీఎంకే పార్టీలు పిటిషన్‌ దాఖలు చేశాయి. రిజర్వేషన్‌ లబ్ధికి సంబంధించి ఆర్టికల్‌ 32 కింద వారు పిటిషన్‌ వేయడం సమంజసం కాదని సుప్రీం పేర్కొంది. తక్షణమే పిటిషన్లను వెనక్కి తీసుకొని మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: : గులాబీ రంగు సరస్సు ఎప్పుడైనా చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.