ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అగ్ర నేతలు ఇద్దరూ ప్రచారాల్లో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినప్పటికీ ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కాంగ్రెస్ ఎంపీ సుశ్మితా దేవ్ సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయంపై స్పందించాలని ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
సుశ్మితా దేవ్ ఫిర్యాదుపై చర్యలు చేపట్టేందుకు ఈసీకి పూర్తి స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'ధిక్కరణ'పై రాహుల్కు సుప్రీం మరో అవకాశం